రెండు లారీలు ఢీ.. ఓ డ్రైవర్ సజీవదహనం

అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం తాడిపత్రి సమీపంలోని కడప రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి..

  • Jyothi Gadda
  • Publish Date - 12:31 pm, Tue, 30 June 20
రెండు లారీలు ఢీ.. ఓ డ్రైవర్ సజీవదహనం

అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం తాడిపత్రి సమీపంలోని కడప రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి ఓ లారీ డ్రైవర్‌ సజీవదహనమయ్యాడు. తాడిపత్రి నుంచి వరిపొట్టు లోడుతో వెళ్తున్న లారీ, కడప నుంచి బొగ్గు లోడ్‌తో తాడిపత్రి వైపు వస్తున్న మరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. రెండు వాహనాలు బలంగా ఢీకొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి బొగ్గు లారీ డ్రైవర్‌ మంటల్లో కాలిపోయాడు. మృతిచెందిన లారీ డ్రైవర్‌ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నిషార్‌‌గా గుర్తించారు.

ప్రమాదంలో మరో లారీలోని ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు, పోలీసులు గంటపాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. క్షతగాత్రులను బయటకు తీసి తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.