128 కరోనా కేసులు.. కేరాఫ్ ఢిల్లీ నిజాముద్దీన్ మసీదు

ఢిల్లీ లోని మర్కజ్ నిజాముద్దీన్ లో 100 సంవత్సరాల నాటి మసీదు ఇప్పుడు దేశ వ్యాప్త సంచలనమైంది. ఇక్కడ ఇటీవల మతపరమైన కార్యక్రమాలకు హాజరైనవారికి సామాజిక  దూరమన్న ధ్యాసే లేదు.

128 కరోనా కేసులు.. కేరాఫ్ ఢిల్లీ నిజాముద్దీన్ మసీదు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 01, 2020 | 11:26 AM

ఢిల్లీ లోని మర్కజ్ నిజాముద్దీన్ లో 100 సంవత్సరాల నాటి మసీదు ఇప్పుడు దేశ వ్యాప్త సంచలనమైంది. ఇక్కడ ఇటీవల మతపరమైన కార్యక్రమాలకు హాజరైనవారికి సామాజిక  దూరమన్న ధ్యాసే లేదు. కరోనా మహమ్మారిసృష్టిస్తున్న విలయంపై ఏ మాత్రం భయం గానీ, ఆందోళన గానీ లేదు. నిబంధనల ఊసే లేదు. తబ్లీఘీ జమాత్ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ అయిన ఈ మసీదు కరోనావైరస్ హాట్ స్పాట్ గా మారింది. ఈ మసీదులో ఈ మధ్య జరిగిన కార్యక్రమాలకు హాజరైనవారిలో సుమారు 128 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. వీరంతా వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వఛ్చినవారు. సుమారు వెయ్యి మంది ఈ మసీదులో ఉన్నారని మర్కజ్ అధికారులు తెలిపారు. మార్చి 8..10 తేదీల మధ్య ఇక్కడ జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న తబ్లీఘీ సభ్యుల ఆచూకీని కనుగొనాలని హోం శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలనూ కోరింది. వీరిలో తమిళనాడు నుంచి 50 మంది, ఢిల్లీ నుంచి 24, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి 21 మంది చొప్పున, అండమాన్ నికోబార్ నుంచి 10 మంది, అస్సాం, జమ్మూకాశ్మీర్ నుంచి ఒక్కొక్కరు చొప్పున కరోనా కాటు బాధితులున్నారు. 824 మంది విదేశియులు కూడా వివిధ రాష్ట్రాలకు తరలి వెళ్లారట. వారి వివరాలను అధికారులు సేకరించే పనిలో పడ్డారు. అసలు తబ్లీఘీ జమాత్ అన్నది 1926 లో ఏర్పాటైన ఇస్లామిక్ మిషన్ సంస్థ.. ఈ సంస్థలో ప్రపంచ వ్యాప్తంగా సభ్యులున్నారు. గత ఫిబ్రవరి, మార్చి నెలల కాలంలో మలేసియా, పాకిస్తాన్ దేశాల్లో జరిగిన ఈ విధమయిన మత కారక్రమాల్లో పాల్గొన్నవారు కూడా వైరస్ ల బారిన పడ్డారు.