పోలీసుల తనిఖీల్లో భారీగా పట్టుబడ్డ నగదు.. బద్వేలులో రూ.1.05 కోట్లు సీజ్

పోలీసులు తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. ఎలాంటి రశీదులు లేకుండా భారీ మొత్తంలో నగదును తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసుల తనిఖీల్లో భారీగా పట్టుబడ్డ నగదు.. బద్వేలులో రూ.1.05 కోట్లు సీజ్
Follow us

|

Updated on: Nov 25, 2020 | 2:07 PM

పోలీసులు తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. ఎలాంటి రశీదులు లేకుండా భారీ మొత్తంలో నగదును తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కడప జిల్లాలోని బద్వేలు సమీపంలో గోపవరం మండలం పి.పి.కుంట చెక్‌పోస్టు వద్ద బుధవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇదే క్రమంలో కర్ణాటక నుంచి నెల్లూరు వస్తున్న వాహనంపై అనుమానంతో తనిఖీ చేశారు. దీంతో కారులో ఉన్న రూ.1.05 కోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్టు ఓస్‌డీ దేవప్రసాద్‌ తెలిపారు. ఇందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే, నగదును తరలింపునకు సంబంధించిన వివరాలపై పోలీసులు విచారణ చేపట్టారు. స్వాధీనం చేసుకున్న నగదును ఆదాయపన్నుశాఖ అధికారులకు అప్పగిస్తామని, దర్యాప్తు కొనసాగుతుందని ఓస్‌డీ తెలిపారు.