‘మీవి చౌకబారు రాజకీయాలు’.. సోనియాపై బీజేపీ ఫైర్

దేశంలో ఈ కరోనా వేళ బీజేపీ.. మత విద్వేషపూరిత వైరస్ ని వ్యాపింపజేస్తోందని అంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన ఆరోపణను కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రకాష్ జవదేకర్ ఖండించారు.

'మీవి చౌకబారు రాజకీయాలు'.. సోనియాపై బీజేపీ ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 23, 2020 | 5:35 PM

దేశంలో ఈ కరోనా వేళ బీజేపీ.. మత విద్వేషపూరిత వైరస్ ని వ్యాపింపజేస్తోందని అంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన ఆరోపణను కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రకాష్ జవదేకర్ ఖండించారు. చౌక బారు  రాజకీయాలు (చీప్ పాలిటిక్స్) చేయరాదని ఆయన సోనియాకు సూచించారు. మేమేమీ మతపరమైన చీలికలు తేవడానికి యత్నించడంలేదని, సంఘటితంగా కరోనాపై పోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు. దయచేసి చీప్ పాలిటిక్స్ కి దిగకండి అని కోరారు. కాగా-గురువారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడిన సోనియా.. ఇండియాలోని ప్రతి వ్యక్తీ కోవిడ్-19 పై పోరాడుతుంటే బీజేపీ.. సామాజిక సామరస్యానికి తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె తమ పార్టీ నేతలనుద్దేశించి ప్రసంగించారు. దేశంలో లాక్ డౌన్ అమలులోకి వఛ్చినప్పటినుంచి తాను ఎన్నోసార్లు ప్రధాని మోదీకి లేఖలు రాశానని, పలు సూచనలు చేశానని, నిర్మాణాత్మక సహకారం ఉంటుందని పేర్కొన్నానని ఆమె చెప్పారు. అయితే దురదృష్టవశాత్తూ ప్రభుత్వం తమ సూచనలకు  పాక్షికంగా మాత్రమే స్పందించిందని అన్నారు. బీజేపీ మత చీలికలు తెచ్చేందుకు యత్నిస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఓ తీర్మానాన్ని ఆమోదించింది.

రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!