శ్ర‌ద్ధా క‌పూర్‌ బర్త్ డేకి సాహో గిఫ్ట్- టీజర్

బాహుబలి తర్వాత ప్రభాస్ మరో భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందకు రాబోతున్నారు. ‘సాహో’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా యు.వి క్రియేషన్స్ సంస్థ దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కిస్తోంది. అటు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు యావత్ భారతదేశంలో ఉన్న సినీ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతున్న సాహో చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోని షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ – 1 పేరిట గత ఏడాది ప్రభాస్ పుట్టినరోజు […]

శ్ర‌ద్ధా క‌పూర్‌ బర్త్ డేకి సాహో గిఫ్ట్- టీజర్
Follow us

| Edited By:

Updated on: Mar 03, 2019 | 12:10 PM

బాహుబలి తర్వాత ప్రభాస్ మరో భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందకు రాబోతున్నారు. ‘సాహో’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా యు.వి క్రియేషన్స్ సంస్థ దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కిస్తోంది. అటు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు యావత్ భారతదేశంలో ఉన్న సినీ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతున్న సాహో చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోని షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ – 1 పేరిట గత ఏడాది ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన చిత్ర బృందం, ఇవాళ ‘సాహో’ లో హీరోయిన్ గా నటిస్తున్న శ్రద్ధా కపూర్ బర్త్ డే సందర్భంగా ‘షేడ్స్ ఆఫ్ సాహో – 2’ విడుదల చేశారు.

యాక్షన్‌ థ్రిల్లర్‌ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఈ సంవత్సరమే విడుదల కానుంది. ఇక ఈ తాజా వీడియోలో షూటింగ్ దృశ్యాలను, అత్యాధునిక వెపన్స్ ను, ఫైట్ సీన్లను చూపించారు. శ్రద్ధా కపూర్ ను సైతం ఫ్యాన్స్ కు పరిచయం చేశారు. ఈ సినిమా ‘రన్‌ రాజా రన్‌’ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా, బాలీవుడ్‌ నటీ నటులు నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, మందిరా బేడిలు కీలక పాత్రలను పోషిస్తున్నారు. దీన్ని ఆగస్టు 15న విడుదల చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంది.