దేశవ్యాప్తంగా మహాత్ముడి జన్మదిన వేడుకలు.. సబర్మతిలో మోదీ

గాంధీజీ.. 200 ఏళ్ల ఆంగ్లేయుల పాలన నుంచి భారతావనికి స్వేచ్ఛావాయువులు అందించిన మహాపురుషుడు. ప్రపంచానికి అహింసా మార్గాన్ని ప్రబోధించిన మార్గదర్శి బాపుజీ. సత్యాగ్రహ్రాన్ని ఆయుధంగా మలిచి.. పోరాటం చేసిన మహాత్ముడు గాంధీజీ. ఓ సామాన్యుడిలా జీవితాన్ని ప్రారంభించిన గాంధీ.. మహాత్ముడిగా మారిన తీరు.. ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. అంతేకాదు.. హింసతో సాధించేది ఏం లేదంటూ.. అహింసతోనే దేశానికి స్వాతంత్య్రం సాధిస్తానని చెప్పి.. ఆ మాటలను నిజం చేసిన తీరు ప్రపంచానికే ఆదర్శం. అలాంటి మహానీయుడి జన్మదినం నేడు. ఈ […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:35 am, Wed, 2 October 19

గాంధీజీ.. 200 ఏళ్ల ఆంగ్లేయుల పాలన నుంచి భారతావనికి స్వేచ్ఛావాయువులు అందించిన మహాపురుషుడు. ప్రపంచానికి అహింసా మార్గాన్ని ప్రబోధించిన మార్గదర్శి బాపుజీ. సత్యాగ్రహ్రాన్ని ఆయుధంగా మలిచి.. పోరాటం చేసిన మహాత్ముడు గాంధీజీ. ఓ సామాన్యుడిలా జీవితాన్ని ప్రారంభించిన గాంధీ.. మహాత్ముడిగా మారిన తీరు.. ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. అంతేకాదు.. హింసతో సాధించేది ఏం లేదంటూ.. అహింసతోనే దేశానికి స్వాతంత్య్రం సాధిస్తానని చెప్పి.. ఆ మాటలను నిజం చేసిన తీరు ప్రపంచానికే ఆదర్శం. అలాంటి మహానీయుడి జన్మదినం నేడు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆయన 150వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

సబర్మతిలో మోదీ..

మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. అక్కడ జాతిపితకు ఘన నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత సబర్మతి నది సమీపంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇదే వేదికగా భారత్​ను బహిరంగ మల మూత్ర విసర్జన రహిత దేశంగా ప్రకటించనున్నారు. దేశవ్యాప్తంగా కార్యక్రమాలు..మహాత్ముడి జయంతిని అట్టహాసంగా నిర్వహిస్తోంది కేంద్రం. జాతి యావత్తు బాపూ స్మరణతో ‘వైష్ణవ జనతో’ రాగాలాపనలతో నిండనుంది. కేంద్రమంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఘనంగా జాతిపిత జయంతి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.