Breaking News
  • నల్గొండ: చండూరు డాన్‌బాస్కో కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఫస్టియర్‌ విద్యార్థి ప్రకాష్‌. ప్రకాష్‌ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం. ప్రకాష్‌ స్వస్థలం గుంటూరు జిల్లా .
  • ప.గో: సంజీవయ్య నగర్‌లో కొండచిలువ కలకలం. నివాసాల మధ్యకు వచ్చిన 8 అడుగుల కొండచిలువ. భయబ్రాంతులకు గురైన స్థానికులు కొండచిలువను కొట్టి చంపిన స్థానికులు.
  • ప.గో: పెనుమంట్ర మండలం మార్టేరులో కిసాన్‌ మేళా. కిసాన్‌ మేళాలో పాల్గొన్న వ్యవసాయ మంత్రి కన్నబాబు. మాది రైతు పక్షపాత ప్రభుత్వం-మంత్రి కన్నబాబు. 44 లక్షల రైతు కుటుంబాలకు రైతుభరోసా వర్తింపు. రూ.3లక్షల రుణం తీసుకున్న రైతులకు వడ్డీ లేదు-కన్నబాబు. చిరుధాన్యాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు. త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తాం-మంత్రి కన్నబాబు
  • సంగారెడ్డి: జిల్లాలో పలు అభివృద్ధి పనులకు హరీష్‌రావు శంకుస్థాపన. జోగిపేట, ఆందోల్‌లో రూ.10కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన హరీష్‌. మున్సిపాల్టీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విజయం ఖాయం-మంత్రి హరీష్‌రావు. కాళేశ్వరం, మల్లన్న సాగర్‌ నీళ్లతో సింగూర్‌ను నింపుతాం-హరీష్‌. సాగుకోసం సింగూర్‌ నీరు మెదక్ జిల్లాకు దక్కేలా ప్రణాళికలు రచిస్తాం. సింగూర్‌లో నీళ్లు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తాం. అదనంగా నిధులు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు-హరీష్‌రావు.
  • తెలంగాణ భవన్‌లో ముగిసిన టీఆర్‌ఎస్‌పీపీ సమావేశం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదాపై పోరాడుతాం-ఎంపీ నామా. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్ట్‌లకు నిధులు కోరుతాం-ఎంపీ నామా. కాళేశ్వరంపై సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్‌ దాఖలు చేయడంపై సీఎం కేసీఆర్‌ స్పందించారు-ఎంపీ నామా నాగేశ్వరరావు. బయ్యారం స్టీల్‌ప్లాంట్‌తో పాటు 30 అంశాలపై చర్చించాం . హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం-నామా నాగేశ్వరరావు. మిషన్‌ భగీరథ పథకానికి కేంద్రాన్ని నిధులు కోరుతాం-ఎంపీ నామా.
  • హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేటీఆర్‌ దిశానిర్దేశం. పార్లమెంట్ సమావేశాల్లో విభజన హామీలు పెండింగ్‌ సమస్యలను లేవనెత్తాలని కేటీఆర్‌ ఆదేశం. బడ్జెట్‌లో తెలంగాణకు దక్కాల్సిన అంశాలు, ప్రాజెక్టులు నిధులపై ఇప్పటి నుంచే పనిచేయాలని ఎంపీలకు సూచన. గణాంకాలతో ఎంపీలకు సమగ్ర సమాచారం అందించాలన్న కేటీఆర్‌. దేశ రాజధానిలో అన్ని హంగులతో పార్టీ కార్యాలయం నిర్మిస్తాం. పార్టీ ఆఫీస్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్న కేటీఆర్‌.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.88కోట్లు

కాశ్మీర్ పై యుఎస్ కమిటీలో రచ్చ.. భారత జర్నలిస్ట్ ఖండన

కాశ్మీర్ సమస్యపై యుఎస్ కాంగ్రెస్ రచ్చ చేస్తోందని సీనియర్ జర్నలిస్ట్ ఆర్తీ టికూసింగ్ ఆరోపించారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరుపుతున్న దాడుల వల్ల కాశ్మీరీ ముస్లిములు ఎంతో నష్టపోతున్నారని ఆమె అన్నారు. కానీ… దీన్ని పలువురు విదేశీయులు, ప్రపంచ మీడియా పెద్దగా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. కాశ్మీర్ పై యుఎస్ కాంగ్రెస్ కమిటీ ‘ విచారణ ‘ జరుపుతున్న సంగతి విదితమే. ఈ తంతు పక్షపాతపూరితంగా ఉందని, ఇండియాకు వ్యతిరేకంగా, పాకిస్థాన్ కు అనుకూలంగా ఉందని టికూసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ దక్షిణాసియాలో మానవ హక్కులు ‘ అన్న అంశంపై యుఎస్ హౌస్ ఫారిన్ ఎఫైర్స్ కమిటీ వాషింగ్టన్ లో నిర్వహించిన విచారణలో ఆమె తన వాంగ్మూలమిచ్చారు.

కాశ్మీర్ రాష్ట్రంలో 30 ఏళ్లుగా ఇస్లామిక్ జిహాద్ కొనసాగుతోందని, పాక్ ప్రోత్సాహంతో టెర్రరిస్టులు విజృంభిస్తున్నా ప్రపంచ మీడియా దీన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆమె అన్నారు. (కాశ్మీర్ అంశంపై మాట్లాడాలని ప్రభుత్వం ఈమెను నామినేట్ చేసింది). అయితే యుఎస్ కాంగ్రెస్ సభ్యురాలైన ఇల్హన్ ఉమర్.. టికూసింగ్ తో విభేదిస్తూ.. ఆమె అర్థరహితమైన వాదన చేస్తోందని విమర్శించారు. జర్నలిస్టుల ‘ జాబ్ ‘ అన్నది నిజాన్ని ఖఛ్చితంగా తెలుసుకుని ప్రజలకు దాన్ని వివరించడమేనని ఆమె వ్యాఖ్యానించింది. కాశ్మీర్లో అణచివేత మానవహక్కులకు మంచిదే అన్న రీతిలో మీ ప్రసంగం ఉందని ఇల్హన్ సెటైర్లు వేసింది. ఈ వ్యాఖ్యలను టికూసింగ్ ఖండిస్తూ.. గత 20 ఏళ్లుగా తాను జర్నలిజం వృత్తిలో ఉన్నానని, ఎవరిపట్లా పక్షపాతం చూపాల్సిన అవసరం తనకు లేదని పేర్కొన్నారు. కాశ్మీర్ లోని వాస్తవ పరిస్థితులపై వాల్డ్ మీడియా వక్రీకరించడమే తనను బాధిస్తోందని ఆమె అన్నారు.
గత ఏడాది ఆ రాష్ట్రంలో సీనియర్ జర్నలిస్ట్ షుజాత్ బుఖారీ దారుణ హత్యను ఆమె గుర్తు చేశారు.
భారత-పాకిస్తాన్ దేశాల మధ్య చర్చలు జరిగి శాంతి నెలకొనాలని బుఖారీ భావించేవారని ఆమె అన్నారు. ఇదే విషయమై ఆయన ప్రపంచంలోని పలు నగరాలను చుట్టి వచ్చారని, అయితే 2018 జూన్ 14 న బుఖారీని శ్రీనగర్ లోని ఆయన కార్యాలయం వద్దే లష్కరే తోయిబా ఉగ్రవాదులు కాల్చి చంపారని టికూసింగ్ పేర్కొన్నారు. ఇదే సంస్థ 2008 లో ముంబైలో దారుణ పేలుళ్లకు పాల్పడితే అమెరికా ఈ సంస్థను నిషేధించిందని ఆమె తెలిపారు.