బెంగుళూరులో భారీ వర్షాలు, చేతుల్లో పసిబిడ్డలను ఎత్తుకుని రక్షించారు

బెంగుళూరులోని అనేక ప్రాంతాలు భారీ వర్షాలతో తల్లడిల్లుతున్నాయి. బెంగుళూరు రూరల్, అర్బన్, తుమ్ కూరు, చిక్ బల్లాపూర్, హసన్ తదితర జిల్లాల్లో చాలాచోట్ల ఇళ్లన్నీ జలమయమయ్యాయి.

  • Umakanth Rao
  • Publish Date - 12:24 pm, Sat, 24 October 20

బెంగుళూరులోని అనేక ప్రాంతాలు భారీ వర్షాలతో తల్లడిల్లుతున్నాయి. బెంగుళూరు రూరల్, అర్బన్, తుమ్ కూరు, చిక్ బల్లాపూర్, హసన్ తదితర జిల్లాల్లో చాలాచోట్ల ఇళ్లన్నీ జలమయమయ్యాయి. నడుములోతుకు పైగా నీళ్లలో తడుస్తూ స్థానికులు తమ పసి బిడ్డలను చేతుల్లో ఎత్తుకుని రక్షించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 15 రోజుల చిన్నారిని ఓ వ్యక్తి ఎత్తుకుని అవతల ఓ మహిళకు అందిస్తుండగా.. తగిన జాగ్రత్తలు చెబుతూ మరో వ్యక్తి ఎదురింటి పైకప్పున నిలబడి కేకలు పెట్టడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. శనివారం కూడా కర్నాటక లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.