ఉత్తరాఖండ్ లో కూలిన బ్రిడ్జి.. ఇద్దరికి గాయాలు

భారత-చైనా సరిహద్దుల నుంచి సుమారు 50 కి.మీ.దూరంలోని ఉత్తరాఖంఢ్ లో... ఓ జిల్లాలో బెయిలీ బ్రిడ్జి కూలిపోయింది. ఓ భారీ యంత్రం తో వస్తున్న ట్రక్కు ఈ బ్రిడ్జిని దాటుతుండగా ఆ బరువుకు ఒక్కసారిగా అది కూలింది. ఈ ఘటనలో ట్రక్కు డ్రైవర్, మెషీన్ ఆపరేటర్..

ఉత్తరాఖండ్ లో కూలిన బ్రిడ్జి.. ఇద్దరికి గాయాలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 23, 2020 | 7:40 PM

భారత-చైనా సరిహద్దుల నుంచి సుమారు 50 కి.మీ.దూరంలోని ఉత్తరాఖంఢ్ లో… ఓ జిల్లాలో బెయిలీ బ్రిడ్జి కూలిపోయింది. ఓ భారీ యంత్రం తో వస్తున్న ట్రక్కు ఈ బ్రిడ్జిని దాటుతుండగా ఆ బరువుకు ఒక్కసారిగా అది కూలింది. ఈ ఘటనలో ట్రక్కు డ్రైవర్, మెషీన్ ఆపరేటర్ ఇద్దరూ గాయపడ్డారు. నిజానికి ఈ వంతెన బరువును మోసే కెపాసిటీ 18 టన్నులు మాత్రమే.. అయితే భారీ యంత్రం, దానితో బాటు ట్రక్కు బరువు రెండూ కలిసి 26 టన్నులు ఉండడంతో వంతెన కూలింది. గాయపడిన ఇద్దరినీ హాస్పిటల్ కి తరలించారు. 2009 లో ఈ బ్రిడ్జిని నిర్మించారట. కొత్త దాన్ని నిర్మించాలంటే మరో పక్షం రోజులు పడుతుందని అంటున్నారు. కాగా ఈ బ్రిడ్జి కూలడంతో చుట్టుపక్కల గల 15 గ్రామాలు బాహ్యప్రపంచంతో సంబంధాలను కోల్పోయాయి.