లోయలో భారీగా భద్రతా బలగాలు.. పీడీపీ, ఎన్సీ అభ్యంతరాలు

మొదట 10,000 మంది.. తర్వాత 28000 మంది. ఆ తర్వాత.. అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత.. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్. ఇదంతా జమ్ముకశ్మర్‌లో జరుగుతున్న పరిణామాలని అర్థమయ్యే ఉంటుంది. గత వారంలో రోజులుగా దేశ వ్యాప్తంగా ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలను భారీ స్థాయిలో మోహరిస్తుండటం చూస్తే… లోయలో ఏం జరగబోతోందన్న వార్తలు.. రకరకాలుగా వినిపిస్తున్నాయి. కేవలం వారం వ్యవధిలోనే విడతల వారిగా 38 వేల మంది సైన్యాన్ని […]

లోయలో భారీగా భద్రతా బలగాలు.. పీడీపీ, ఎన్సీ అభ్యంతరాలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 03, 2019 | 2:18 PM

మొదట 10,000 మంది.. తర్వాత 28000 మంది. ఆ తర్వాత.. అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత.. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్. ఇదంతా జమ్ముకశ్మర్‌లో జరుగుతున్న పరిణామాలని అర్థమయ్యే ఉంటుంది. గత వారంలో రోజులుగా దేశ వ్యాప్తంగా ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలను భారీ స్థాయిలో మోహరిస్తుండటం చూస్తే… లోయలో ఏం జరగబోతోందన్న వార్తలు.. రకరకాలుగా వినిపిస్తున్నాయి. కేవలం వారం వ్యవధిలోనే విడతల వారిగా 38 వేల మంది సైన్యాన్ని దింపడంతో.. స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకొంది.

రాష్ట్ర వ్యాప్తంగా సైనికుల మోహరింపుపై అక్కడి పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం రాష్ట్రం విషయంలో ఏదో కీలక నిర్ణయం తీసుకోబోతోందని.. అందుకే సైనిక బలగాలను దింపుతోందన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి.

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తిని అందించే ఆర్టికల్ 35-ఏ, 370లకు సంబంధించి కేంద్రం కఠిన నిర్ణయం తీసుకోబోతుందా అనేది ఆసక్తి కరంగా మారింది. దీనిపై ఇప్పటికే జమ్ముకశ్మీర్ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా కేంద్ర బలగాల రాకపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాత్ర మార్గంలో సమస్య ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా బలగాలను ఎందుకు మోహరించారని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇదే అంశంపై ఒమర్ అబ్ధుల్లా గవర్నర్ సత్యపాల్ మాలిక్ ను కలిశారు.  రాష్ట్రంలో పెగుతున్న ఉద్రిక్తతలపై ఎవరు స్పందించడం లేదని ఒమర్ అబ్దుల్లా అసంతృప్తిని వ్యక్తం చేశారు.