ఒలింపిక్‌ మెడలిస్ట్‌కి ఎంత కష్టమొచ్చింది..

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడంతో.. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రెటీల వరకు అష్టకష్టాలు పడుతున్నారు. ఆర్థిక వెసులుబాటు కోసం అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ కోవలోకి వస్తాడు జపాన్‌కు చెందిన ఫెన్సర్‌ రియో మియాక్‌. గతంలో అనేక అంతర్జాతీయ పతకాలు సాధించిన రియో మియాక్‌.. కరోనా దెబ్బకి ఫుడ్‌ డెలివరీ బాయ్‌ మారిపోయాడు. ఆర్థికంగా నిలబడటంతో పాటు రాబోయే పోటీల్లో పాల్గొనడానికి రోజు వారి ఖర్చుల కోసం పని చేస్తున్నాడు. […]

ఒలింపిక్‌ మెడలిస్ట్‌కి ఎంత కష్టమొచ్చింది..
Follow us

|

Updated on: May 15, 2020 | 4:21 PM

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడంతో.. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రెటీల వరకు అష్టకష్టాలు పడుతున్నారు. ఆర్థిక వెసులుబాటు కోసం అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ కోవలోకి వస్తాడు జపాన్‌కు చెందిన ఫెన్సర్‌ రియో మియాక్‌.

గతంలో అనేక అంతర్జాతీయ పతకాలు సాధించిన రియో మియాక్‌.. కరోనా దెబ్బకి ఫుడ్‌ డెలివరీ బాయ్‌ మారిపోయాడు. ఆర్థికంగా నిలబడటంతో పాటు రాబోయే పోటీల్లో పాల్గొనడానికి రోజు వారి ఖర్చుల కోసం పని చేస్తున్నాడు. ఉబర్‌ ఈట్స్‌లో డెలివరీ బాయ్‌గా అవతారం ఎత్తాడు. రోజూ రెండువేలు యెన్‌లు సంపాదిస్తున్నాడు.

2012లో జరిగిన ఒలింపిక్స్‌లో టీమ్‌ విభాగంలో రజత పతకం గెలిచిన రియో మియాక్‌.. ఈఏడాది తమ దేశంలో జరిగే ఒలింపిక్స్‌ సిద్ధమయ్యాడు. అది కాస్తా వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో చేసేదిలేక మియాక్ డెలివరీ బాయ్‌గా మారిపోయాడు. ఒలంపిక్స్ గేమ్స్ కి విరామం దొరకడంతో.. ఒకవైఫు ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ.. మరోవైపు ఆర్థికంగా వెసులుబాటు దొరుకుతుందంటున్నాడు రియో మియాక్. కరోనా వైరస్‌ రిస్క్‌ లేని ప్రాంతాల్లోనే భౌతిక దూరాన్ని పాటిస్తూ.. ఫుడ్‌ డెలివరీ చేస్తున్నానని తెలిపాడు.