నిఘా నీడలో పాత సచివాలయం కూల్చివేత పనులు

దశాబ్దాల చరిత్రకు, ఎన్నో కీలక ఘట్టాలకు మౌన సాక్ష్యాలుగా నిలిచిన సచివాలయ భవనాలు ఒక్కొక్కటిగా నేలకూలుతున్నాయి. కూల్చివేత పనులపై కేసీఆర్ ప్రత్యేక ద‌ృష్టి పెట్టారు. కూల్చివేత పనులను...

నిఘా నీడలో పాత సచివాలయం కూల్చివేత పనులు
Follow us

|

Updated on: Jul 09, 2020 | 4:57 PM

Old Secretariat Demolition Works in The CCTV : పాత సచివాలయం కూల్చివేత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దశాబ్దాల చరిత్రకు, ఎన్నో కీలక ఘట్టాలకు మౌన సాక్ష్యాలుగా నిలిచిన సచివాలయ భవనాలు ఒక్కొక్కటిగా నేలకూలుతున్నాయి. కూల్చివేత పనులపై కేసీఆర్ ప్రత్యేక ద‌ృష్టి పెట్టారు. కూల్చివేత పనులను తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, డిజీపీ మహేందర్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు.

పాత సచివాలయం కూల్చివేత నేపథ్యంలో కిలోమీటరు పరిధిలో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య కూల్చివేత పనులను నిర్వహిస్తున్నారు. కూల్చివేత పనులు జరుగుతున్న ప్రాంతంలో నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. అక్కడ పనిచేస్తున్న కూలీల మొబైల్ ఫోన్లను కూడా పోలీస్ అధికారులు నిత్యం డిపాజిట్ చేసుకున్న తర్వాతే పనులు జరుగుతున్న ప్రాంతంలోకి అనుమతి ఇస్తున్నారు.

కొత్త నిర్మాణాలకు వీలుగా 25.5 ఎకరాల్లో ప్రాంగణాన్ని సిద్ధం చేసేందుకు 12 నుంచి 15 రోజుల వరకు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాస్తు దోషాలను చక్కదిద్దేందుకు ఈ ప్రాంగణాన్ని చతురస్రాకారంగా తయారు చేస్తున్నారు. ఇందుకు వీలుగా మింట్ కాంపౌండ్ వైపు కొంత స్థలాన్ని, సచివాలయం ప్రధాన గేటు వైపు ఉన్న విద్యుత్తు శాఖ స్టోన్ బిల్డింగ్ కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఇప్పటికే పాత సచివాలయంలోని జీ బ్లాక్, సీ బ్లాక్ (సర్వహిత), రాక్ స్టోన్, డీ బ్లాక్ కూల్చివేత దాదాపు ముగిసింది. ఈ రోజు A , B బ్లాక్ ల కూల్చివేత పనులు సాగుతున్నాయి. ఇక K, L, J నార్త్ హెచ్, సౌత్ హెచ్ బ్లాక్ ల కూల్చివేత పై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??