దివ్యాంగుల శిబిరంలో వృద్దుడు మృతి

Old man dies Accidentally fell down in PHC Camp, దివ్యాంగుల శిబిరంలో వృద్దుడు మృతి
కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దివ్యాంగుల శిబిరంలో ప్రమాదవశాత్తు కిందపడి ఓ వృద్దుడు ప్రాణాలు కొల్పోయాడు. జిల్లాలోని కోడుమూరు పట్టణంలో దివ్యాంగులకు ట్రైసైకిల్‌ అందజేసేందుకు గానూ కిష్టాపూర్‌ గ్రామంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న చాలా మంది దివ్యాంగులు ట్రైసైకిల్‌ కోసం వచ్చారు. ఈ క్రమంలోనే క్రిష్ణపురం గ్రామానికి చెందిన కామెశ్వర రెడ్డి అనే వృద్దుడు మెట్లమీదనుండి జారిపడి అక్కడికక్కడే ప్రాణాలు కొల్పోయాడు. జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు..సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *