బతికుండగానే స్మశాన వాటికకు చేరిన తల్లి.. ‘మృతి’

Old Age women Died Due to Severe Health Problem, బతికుండగానే స్మశాన వాటికకు చేరిన తల్లి.. ‘మృతి’

జగిత్యాల జిల్లా కేంద్రంలో తల్లి బ్రతికుండగానే స్మశాన వాటికకు చేర్చిన కన్న కొడుకు ఉదంతం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా వార్త సంచలనం రేపటంతో..అధికారులు హుటాహుటినా ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చెట్‌పల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ సంఘటన అందరికీ తెలిసిందే. చెట్‌పల్లి గ్రామానికి చెందిన వృద్దురాలు నర్సమ్మ..ఇవాళ కన్నుమూసింది. జగిత్యాలలోనే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం నర్సమ్మను ఎక్కడికి తరలించాలో అర్ధంకాని ఆమె కొడుకు తనను ఓ పాడుబడిన ఇందిరమ్మ గృహనికి తరలించారు. ఇన్ని రోజులుగా ఆ కుటుంబం పాడుబడిన ఇంట్లోనే గడిపిందని స్థానికులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన ప్రభుత్వాధికారులు స్పందించి ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించి..వారి సొంతింటి కలను సాకారం చేయాలని కోరుతున్నారు. నర్సమ్మ లాంటి దుస్థితి మరో తల్లికి రాకూడదని వారు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *