లాక్ డౌన్ నేపథ్యంలో.. రోజుకు 10 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి తగ్గింపు..!

కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. లాక్ డౌన్ నెపథ్యంలో చమురుకు వినియోగం బాగా తగ్గింది. ఈ మేరకు చమురు ఎగుమతి దేశాల సంస్థ(ఒపెక్‌)

లాక్ డౌన్ నేపథ్యంలో.. రోజుకు 10 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి తగ్గింపు..!
Follow us

| Edited By:

Updated on: Apr 10, 2020 | 4:10 PM

కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. లాక్ డౌన్ నెపథ్యంలో చమురుకు వినియోగం బాగా తగ్గింది. ఈ మేరకు చమురు ఎగుమతి దేశాల సంస్థ(ఒపెక్‌) కీలక నిర్ణయం తీసుకుంది. మెక్సికో మినహా ప్రధాన చమురు ఎగుమతి దేశాలన్నీ మే, జూన్‌లో ఉత్పత్తిని రోజుకు 10 మిలియన్‌ బ్యారెళ్లు తగ్గించేందుకు అంగీకరించాయి. గురువారం ప్రారంభమై సుదీర్ఘంగా సాగిన ఒపెక్‌ ప్లస్‌(ఒపెక్‌+రష్యా) సహా ఇతర కీలక దేశాల వీడియో కాన్ఫరెన్స్‌ శుక్రవారం తెల్లవారుజామున ముగిసింది.

కాగా.. జులై నుంచి డిసెంబరు వరకు మెక్సికో అంగీకరిస్తే ఉత్పత్తిని 8 మిలియన్‌ బ్యారెళ్లు తగ్గించాలని నిర్ణయించారు. కరోనా వైరస్‌ ప్రభావం, సౌదీ-రష్యా ధరల యుద్ధం నేపథ్యంలో ఇటీవల చమురు ధరలు రెండు దశాబ్దాల కనిష్ఠానికి పడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్పత్తిని తగ్గించి ధరలకు మద్దతు కల్పించాలని ఒపెక్‌ దేశాలు నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. జూన్‌ 10న మరోసారి సమావేశమై తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు.