బీహార్‌లో ఓఎన్జీసీ పైప్‌లైన్‌ లీక్

బీహార్‌లోని తిరువారుర్‌ వద్ద ఓఎన్జీసీ గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకైంది. పంట పొలాల నడుమ ఉన్న పైప్ లైన్ పగిలి.. భారీగా ఆయిల్ లీకవుతోంది. ముడి చమురు లీకేజీ గురించి తెలిసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

బీహార్‌లో ఓఎన్జీసీ పైప్‌లైన్‌ లీక్
Follow us

|

Updated on: Sep 23, 2020 | 2:00 PM

Pipeline Leak : బీహార్‌లోని తిరువారుర్‌ వద్ద ఓఎన్జీసీ గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకైంది. పంట పొలాల నడుమ ఉన్న పైప్ లైన్ ఒక్కసారిగా పగిలింది. దీంతో చుట్టుపక్కల ఉన్న పంటపొలాల్లోకి ఆయిల్ చేరిపోయింది. దీంతో పచ్చని పంటపొలాలు కాస్తా ఆయిల్‌తో నిండిపోయాయి.

లీకేజీ గురించి తెలిసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. గ్యాస్ లీకేజీ సమాచారంతో అప్రమత్తమైన ఓఎన్జీసీ అధికారులు అవసరమైన పరికరాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయిల్ లీకైన ప్రాంతాన్ని గుర్తించారు. లీక్ జరిగిన ప్రాంతంలో మరమ్మత్తులు చేశారు. అయితే ప్రతిసారి ఇదే ప్రాంతంలో అయిల్ లీక్ అవడానికి గల కారణాలను వెతుకుతున్నారు.

ఇదిలావుంటే.. పంటపొలాలు పూర్తిగా ముడి చమురుతో నిండిపోయాయి. దీంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు తగిన నష్ట పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.