పుల్వామా ఉగ్రదాడి మాస్ట‌ర్‌మైండ్ హ‌తం

శ్రీనగర్‌ : పుల్వామా ఉగ్ర దాడికి ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న జైషే ఉగ్రవాది ముదస్సర్‌ అహ్మద్‌ ఖాన్‌ అలియాస్‌ మహ్మద్‌ భాయ్‌ ఆదివారం జరిగిన ఎన్ కౌంటర్లో హతమైయ్యాడు. ఆదివారం సాయంత్రం దక్షిణ కశ్మీర్‌లో భద్రత దళాలకు, ఉగ్రవాదులకు జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదుల్లో పుల్వామా దాడి సూత్రధారి, 23 ఏళ్ల ఎలక్ట్రీషియన్‌ మహ్మద్‌ భాయ్‌ కూడా ఉన్నాడని అధికారులు వెల్లడిం‍చారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన ముగ్గురి మిలిటెంట్ల మృతదేహాలు […]

పుల్వామా ఉగ్రదాడి మాస్ట‌ర్‌మైండ్ హ‌తం
Follow us

| Edited By:

Updated on: Mar 11, 2019 | 2:00 PM

శ్రీనగర్‌ : పుల్వామా ఉగ్ర దాడికి ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న జైషే ఉగ్రవాది ముదస్సర్‌ అహ్మద్‌ ఖాన్‌ అలియాస్‌ మహ్మద్‌ భాయ్‌ ఆదివారం జరిగిన ఎన్ కౌంటర్లో హతమైయ్యాడు. ఆదివారం సాయంత్రం దక్షిణ కశ్మీర్‌లో భద్రత దళాలకు, ఉగ్రవాదులకు జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదుల్లో పుల్వామా దాడి సూత్రధారి, 23 ఏళ్ల ఎలక్ట్రీషియన్‌ మహ్మద్‌ భాయ్‌ కూడా ఉన్నాడని అధికారులు వెల్లడిం‍చారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన ముగ్గురి మిలిటెంట్ల మృతదేహాలు దగ్ధమయ్యాయని, గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయని, వారిని గుర్తించేందుకు చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కదలికలపై ఇంటెలిజెన్స్‌ సమాచారం మేరకు పింగ్లిష్‌ ప్రాంతంలో చేపట్టిన గాలింపు చర్యల్లో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులకు దిగడంతో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుందని అధికారులు పేర్కొన్నారు.

కాగా, పుల్వామాలో ఫిబ్రవరి 14న సీఆర్‌పీఎఫ్‌ వాహనశ్రేణిపై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అమరులైన ఘటన వెనుక.. 23 ఏళ్ల జైషే మహ్మద్‌ ఉగ్రవాది ముదసర్‌ అహ్మద్‌ ఖాన్‌ అలియాస్‌ మహ్మద్‌ భాయ్‌ ప్రమేయం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. జైషే మానవ బాంబు పాల్పడిన ఈ భీకర దాడికి వాహనం, పేలుడు పదార్ధాలను ఖాన్‌ సమకూర్చినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ట్రాల్‌ ప్రాంతంలోని మిర్‌ మొహల్లా నివాసైన ఖాన్‌ పాక్‌కు చెందిన జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థలో 2017లో అజ్ఞాత కార్యకర్తగా చేరాడని చెప్పారు.పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన జైషే కార్యకర్త అదిల్‌ అహ్మద్‌ దార్‌ నిత్యం ఖాన్‌తో సంప్రదింపులు జరిపినట్టు అధికారులు తెలిపారు. డిగ్రీ వరకూ చదివిన అహ్మద్‌ ఖాన్‌ అలియాస్‌ మహ్మద్‌ భాయ్‌ ఆ తర్వాత ఐటీఐలో ఎలక్ర్టీషియన్‌ కోర్సు చేశాడు. కశ్మీర్‌లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో ఖాన్‌ పాల్గొన్నట్టు అధికారులు వెల్లడించారు.

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!