టీడీపీ నేతల ఇళ్లు కూల్చివేత..పరిస్థితి ఉద్రిక్తం

Officials demolish TDP leader's residence in Nellore district

నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలో హై టెన్షన్ వాతావరణం నెలకుంది. జనార్దన్‌ కాలనీలో అక్రమ నిర్మాణాలంటూ టీడీపీ నేతలకు చెందిన మూడు ఇళ్లను కూల్చివేస్తున్నారు. పోలీసు బందోబస్తు మధ్య తెల్లవారుజాము నుంచి రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు కూల్చివేత ప్రక్రియ చేపట్టారు. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టారని అధికారులు చెబుతుండగా.. తాము సరైన పత్రాలతోనే స్థలం కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించామని టీడీపీ నేతలు అంటున్నారు. టీడీపీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదంతా వైసీపీ సర్కారు కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మూడు రోజుల క్రితమే నిర్మాణాల కూల్చివేతకు రెవెన్యూ అధికారులు రాగా..భాధితుల అభ్యంతరాలతో వెనుదిరిగారు. ఈ తెల్లవారుజామునే మళ్లీ బందోబస్తుతో వచ్చి కూల్చివేత ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *