Breaking News
  • సచివాలయంలోని పశుసంవర్ధక శాఖ లో పనిచేస్తున్న సెక్షన్ అఫిసర్ కు కరోనా పాజిటివ్ గుర్తింపు.. ఇటీవల ఢిల్లీ వెళ్లాడని తెలిసి కరోనా టెస్టులు... టెస్టు చేసిన అనంతరం పాజిటివ్ గా వచ్చినట్లు గుర్తింపు.. గాంధీ ఆస్పత్రి కి తరలించిన అధికారులు.. బిఆర్కే భవనం మొత్తం షానిటైజేషన్ చేస్తున్న అధికారులు.
  • మర్కజ్ ఘటనపై వివరాలు సేకరించిన కేంద్ర హోంశాఖ. దేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి తబ్లీజ్ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండోనేషియా, మలేషియా, థాయ్ లాండ్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, కజకిస్తాన్ నుంచి ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
  • దేశవ్యాప్తంగా మొత్తం 1418 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు. ఈ రోజే 167 పాజిటివ్ కేసులు నమోదు. దేశ వ్యాప్తంగా కరోనా తో 45 మంది మృతి. ఈ ఒక్క రోజే 13 మంది కరోనా తో మృతి చెందినట్లు వెల్లడి. కరోనా నుంచి 123 మంది డిశ్చార్జి. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ.
  • ఉక్రెయిన్​లో చిక్కుకున్న 300 మంది తెలుగు విద్యార్థులు. తిండి లేక ఆకలితోనే గడుపుతున్న విద్యార్థులు. చేతిలో చిల్లి గవ్వ లేక ఎన్నో ఇబ్బందులు. కరోనా రక్కసి మింగేస్తుందేమోననే భయంతో బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు.
  • తెలంగాణ లో ఇప్పటి వరకు 97 కేసులు నమోదు. ప్రస్తుతం 77 మంది వివిధ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులు. ఈ ఒక్క రోజు 15 పాజిటివ్ కేసులు నమోదు. 14 మంది డిశ్చార్జ్,6 మృతి...

Prabhas 21: ‘మహానటి’ దర్శకుడితో ‘బాహుబలి’.. క్రేజీ ప్రాజెక్ట్ షురూ..!

Official announcement on Prabhas next, Prabhas 21: ‘మహానటి’ దర్శకుడితో ‘బాహుబలి’.. క్రేజీ ప్రాజెక్ట్ షురూ..!

2020 సంవత్సరానికి గానూ బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. టాలీవుడ్ ప్రేక్షకులు మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను తెరపైన చూడబోతున్నాయి. బాహుబలి(Baahubali)తో దేశవ్యాప్తంగా క్రేజ్‌ను సంపాదించుకున్న ప్రభాస్(Prabhas) తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ‘మహానటి'(Mahanati)తో విమర్శకుల ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్నారు. ప్రముఖ వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. వైజయంతీ మూవీస్‌ 50సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ బిగ్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. ఇక ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. ‘మరో బ్లాక్ బస్టర్‌ ఆన్ ది వే’ అంటూ వారు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Official announcement on Prabhas next, Prabhas 21: ‘మహానటి’ దర్శకుడితో ‘బాహుబలి’.. క్రేజీ ప్రాజెక్ట్ షురూ..!

కాగా ప్రస్తుతం ప్రభాస్, రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో 20వ చిత్రంలో నటిస్తున్నారు. పీరియాడిక్ లవ్‌ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాదే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. మరోవైపు 2018లో మహానటితో పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకున్న నాగ్ అశ్విన్.. ఆ తరువాత ఏడాదిన్నరకు పైగా గ్యాప్ తీసుకున్నారు. ఈ క్రమంలో ఆ మధ్యన ‘జాతి రత్నాలు’ అనే సినిమా కోసం నిర్మాతగా కూడా మారారు. ఇక ఇప్పుడు ప్రభాస్ కోసం ఓ కథను సిద్ధం చేసుకున్న ఈ సెన్సేషనల్ దర్శకుడు.. త్వరలో ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా తెలియనున్నాయి.

Read This Story Also: మహేష్ హ్యాండ్ ఇచ్చారు.. ప్రభాస్ ఓకే చెప్తారా..!

Related Tags