Phone Connections Cut: ఆ అధికారుల ఫోన్ కనెక్షన్స్ కట్ అవుతున్నాయి.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Phone Connections Cut: తెలంగాణలోని పలు ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది ఫోన్ కనెక్షన్స్ కట్ అవుతున్నాయి. బిల్లులు

Phone Connections Cut: ఆ అధికారుల ఫోన్ కనెక్షన్స్ కట్ అవుతున్నాయి.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Follow us

|

Updated on: Jan 06, 2021 | 5:41 PM

Phone Connections Cut: తెలంగాణలోని పలు ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది ఫోన్ కనెక్షన్స్ కట్ అవుతున్నాయి. బిల్లులు చెల్లించకపోవడంతో సర్వీసులను నిలిపివేస్తున్నారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వమే సిమ్‌లు కొనుగోలు చేసి అందిస్తుంది. ఏదైనా సమస్యలు వస్తే ప్రజలు ఆ నెంబర్లకే ఫోన్ చేసి అధికారులతో మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఆ ఫోన్‌లు మూగబోయాయి. దీంతో అధికారులు, సిబ్బంది తన సొంత ఖర్చుతో సిమ్‌లు కొనుగోలు చేసి వాడుతున్నారు.

అయితే ప్రభుత్వం అందించిన సిమ్‌ నెంబర్లకు ఫోన్ చేస్తే ఇప్పడు స్పందన లేదు. కొత్త నెంబర్లు తీసుకున్న అధికారులు ఆ నెంబర్‌ను ప్రజలకు అందించకుండా వ్యక్తిగతంగా వాడుకుంటున్నారు. దీంతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పలు శాఖలకు చెందిన ఫోన్ల సర్వీసులు కొన్నిరోజులుగా నిలిచిపోయాయి. ప్రధానంగా ఎక్సైజ్‌ శాఖ బీఎస్ఎన్ఎల్ ఫోన్లు పనిచేయడం లేదు. దాదాపు నాలుగైదు నెలల నుంచి ఈ శాఖ తరపును బిల్లులు చెల్లించడం లేదు. దీంతో ముందుగా అవుట్ గోయింగ్ సర్వీసులు తర్వాత ఇన్ కమింగ్ కట్ అయింది. ఆయా శాఖల నుంచి బీఎస్ఎన్ఎల్‌కు 30 కోట్ల బకాయిలు రావలసి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని పలువురు అధికారులు కోరుతున్నారు.

ఉద్యోగాల భర్తీలో స్పీడ్ పెంచిన తెలంగాణ సర్కార్.. ఖాళీల వివరాలు సేకరించిన సీఎస్..