కువైట్ లో సిక్ లీవ్ లెటర్స్ అమ్ముతున్న భారతీయుల అరెస్ట్

సొమ్ములకు ఆశపడి వలస కార్మికులు, ఉద్యోగుల సెలవులను అమ్ముకుంటున్న భారతీయులను కువైట్ అధికారులు పట్టుకున్నారు. డబ్బులు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులు, వలస కార్మికులకు సిక్ లీవ్ లెటర్లు అమ్ముతున్న ఓ భారతీయ ముఠాను కువైట్ అధికారులు అరెస్ట్ చేశారు.

  • Balaraju Goud
  • Publish Date - 5:00 pm, Sat, 5 September 20

సొమ్ములకు ఆశపడి వలస కార్మికులు, ఉద్యోగుల సెలవులను అమ్ముకుంటున్న భారతీయులను కువైట్ అధికారులు పట్టుకున్నారు. డబ్బులు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులు, వలస కార్మికులకు సిక్ లీవ్ లెటర్లు అమ్ముతున్న ఓ భారతీయ ముఠాను కువైట్ అధికారులు అరెస్ట్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌లోని రెసిడెన్సీ ఎఫైర్స్ విభాగం అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఈ ముఠాను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. స్థానికంగా ఉండే కంపెనీల్లో పనిచేసే వారికి ఈ ముఠా సిక్ లీవ్స్ అమ్ముతోంది. ఈ ముఠాపై ఫిర్యాదులు రావడంతో పక్కాఫ్లాన్ ప్రకారం ముగ్గురు సభ్యలు గల ముఠాను అదుపులోకి తీసుకున్నారు అధికారులు..

ఓ అధికారి తనకు సిక్ లీవ్ ఇప్పించాలంటూ ముఠాలోని ఓ వ్యక్తిని సంప్రదించాడు. ఇందుకు అతను డబ్బులు కావాలంటూ డిమాండ్ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. కొందరు డాక్టర్లకు సంబంధించిన నకిలీ స్టాంపులను కూడా ఈ ముఠా వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మాటల మధ్యలో నిందితుడు తన స్నేహితుల గురించి కూడా నిఘా అధికారుల ముందు బయటపెట్టేశాడు.వెంటనే రంగంలోకి దిగి ముగ్గుర్నీ అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 14 మంది డాక్టర్లకు సంబంధించిన సీల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఏడాది క్రితం స్వదేశం వెళ్లిపోయిన ఓ బంగ్లాదేశీ వద్ద నుంచి వీటిని సేకరించినట్లు నిందితులు తెలిపారు.