కారు కొనాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌..భారీగా తగ్గిన ధరలు

మీరు కారు కొనాలనుకుంటున్నారా. ఐతే ఇప్పుడే కొనేయండి. ఆలసించినా ఆశాభంగం. ఎందుకిలా అనుకుంటున్నారా. ఎందుకంటే..దాదాపు అన్నికార్ల కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటించాయి. మరో 15 రోజుల్లో ఈ ఏడాది ముగుస్తుండటంతో కళ్లు తిరిగే ఇయర్‌ ఎండింగ్‌ డిస్కౌంట్స్‌ అనౌన్స్‌ చేశాయి. ఇవి వందలు, వేలల్లో కాదు. లక్షల్లో ఉన్నాయి. ఈ ఏడాది ముగింపు దశకు చేరుకోవడంతో తమ టార్గెట్‌ పూర్తి చేసుకునే పనిలో పడ్డాయి ఆటోమొబైల్స్‌ కంపెనీలు. అసలే ఈ ఏడాది కార్ల అమ్మకాలు భారీగా తగ్గిపోవడంతో..కనీసం […]

కారు కొనాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌..భారీగా తగ్గిన ధరలు
Follow us

|

Updated on: Dec 13, 2019 | 6:38 PM

మీరు కారు కొనాలనుకుంటున్నారా. ఐతే ఇప్పుడే కొనేయండి. ఆలసించినా ఆశాభంగం. ఎందుకిలా అనుకుంటున్నారా. ఎందుకంటే..దాదాపు అన్నికార్ల కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటించాయి. మరో 15 రోజుల్లో ఈ ఏడాది ముగుస్తుండటంతో కళ్లు తిరిగే ఇయర్‌ ఎండింగ్‌ డిస్కౌంట్స్‌ అనౌన్స్‌ చేశాయి. ఇవి వందలు, వేలల్లో కాదు. లక్షల్లో ఉన్నాయి.

ఈ ఏడాది ముగింపు దశకు చేరుకోవడంతో తమ టార్గెట్‌ పూర్తి చేసుకునే పనిలో పడ్డాయి ఆటోమొబైల్స్‌ కంపెనీలు. అసలే ఈ ఏడాది కార్ల అమ్మకాలు భారీగా తగ్గిపోవడంతో..కనీసం ఇలా బంపర్‌ ఆఫర్లతోనైనా కస్టమర్లను ఆకర్షించాలని ప్లాన్‌ చేస్తున్నాయి. అందుకే స్లాక్‌ క్లియరెన్స్‌ సేల్స్‌ ప్రకటించేశాయి. వీలైనంతవరకు స్టాక్‌ను తగ్గించుకోవాలని యోచిస్తున్నసంస్థలు..భారీ డిస్కౌంట్లిచ్చి క్యాష్‌ చేసుకోవాలనుకుంటున్నాయి. ఇక మరో ముఖ్య కారణమేంటంటే 2020 ఏప్రిల్‌ నుంచి బీఎస్‌ రూల్స్‌ తప్పనిసరి కాకున్నాయి. దీంతో బీ 4 వాహనాలను త్వరగా విక్రయించాలని భావిస్తున్నాయి.

దేశీయంగా ప్రధాన కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ సహా హుందాయ్, హోండా, ఫోక్స్ వ్యాగన్, టాటా మోటార్స్ సంస్థలు డిస్కౌంట్లు ఇస్తున్న జాబితాలో ఉన్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

మారుతీ సుజుకీ ఆల్టో 800 పై 60వేలు, బలెనో 45వేలు, ఎస్‌-క్రాస్‌  లక్షా 13వేలు, సియాజ్‌ 75వేలు, ఇగ్నిస్‌ మోడల్‌పై 65వేల ఆఫర్‌ ప్రకటించింది.

ఇక హుందాయ్ కంపెనీ శాంత్రోపై 55వేలు, వెర్నా 60వేలు, క్రెటా 95వేలు, ఎలాంట్రా 2 లక్షలు, గ్రాండ్‌ ఐ 10 నియోస్‌పై 20వేల రూపాయలు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.
ఫోక్స్ వ్యాగన్: పోలోపై ఒకటిన్నర లక్ష, కార్పొరేట్‌ ఆఫర్‌ కింద 25వేలు, డిస్కౌంట్‌ బోనస్‌గా మరో 10వేలు అందించనున్నట్టు పేర్కొంది.
హోండా:  అమేజ్‌ 42 వేలు, జాజ్‌ 50వేలు, డబ్ల్యూఆర్‌-వీ 45వేలు, సిటీ సెడాన్‌ 62వేలు, సివిక్‌పై 2 లక్షలు తగ్గిస్తోంది. టాటా :  టియాగో 75వేలు, హెక్సా లక్షా 65వేలు, నెక్సాన్‌ లక్షా 7వేలు, ఎస్‌యూవీ హారియర్‌పై 65వేల ఆఫర్‌ ప్రకటించింది.