Plastic Bottle: పెట్‌ బాటిల్స్ అంత ప్రాణాంతకమా?.. హడలెత్తిస్తున్న తాజా నివేదికలు..!

Plastic Bottle: సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అయింది. కానీ రీ యూజ్ ప్లాస్టిక్ కు నిషేదం మిగిలింది. రీ యూజ్, రీ సైక్లింగ్ ప్లాస్టిక్ కూడా చాలా నష్టాన్ని..

Plastic Bottle: పెట్‌ బాటిల్స్ అంత ప్రాణాంతకమా?.. హడలెత్తిస్తున్న తాజా నివేదికలు..!
Plastic Bottles
Shiva Prajapati

|

Jul 05, 2022 | 11:10 PM

Plastic Bottle: సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అయింది. కానీ రీ యూజ్ ప్లాస్టిక్ కు నిషేదం మిగిలింది. రీ యూజ్, రీ సైక్లింగ్ ప్లాస్టిక్ కూడా చాలా నష్టాన్ని తెస్తున్నాయని తాజా పరిశోధనలు తెల్చేస్తున్నాయి. ఈ పరిశోధనతో కళ్ళ ముందు కనిపిస్తున్న ప్లాస్టిక్ బాటిళ్లు ప్రాణాలు తీయడానికి సిద్ధమవుతున్నాయా? వాటర్, పెట్ బాటిళ్ల రీసైక్లింగ్ యూసేజ్ మనుషుల మనుగడను దెబ్బతీయబోతోందా? చివరికి మన రక్తంలో సైతం ప్లాస్టిక్ అవశేషాలు గూడుకట్టుకుపోతున్నాయా? అంటే అవుననే అంటోంది లండన్ బ్రూనెల్ యూనివర్సిటీ పరిశోధనలు.

రీ యూజ్.. రీ సైక్లింగ్.. లైఫ్‌ స్టైల్‌లో ఒక భాగమైపోయింది. మరో వైపు ప్లాస్టిక్ కూడా మానవ జీవిత అవసరాల్లో మరో భాగంగా మారిపోయింది. కానీ.. ప్లాస్టిక్ రీయూజ్, రీసైక్లింగ్ లు అతిపెద్ద డేంజర్ అని హెచ్చరిస్తున్నాయి పరిశోధనలు. ప్రధానంగా వాటర్, కూల్ డ్రింక్స్, ఆహార పదార్థాలకు ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ పెట్ బాటిళ్లు, రీసైక్లింగ్ కంటే ప్రమాదకరమైనది మరేదీ లేదనే సంకేతాలను లండన్ బ్రూనెల్ పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.

ముడిపదార్థం నుంచి కొత్తగా తయారు చేయబడిన ప్లాస్టిక్ సీసాల కంటే.. రీసైకిల్ చేసి ఉపయగించే ప్లాస్టిక్ బాటిల్ లు డేంజర్ అంటోంది బ్రూనెల్ యూనివర్సిటీ. ఇలా రీసైక్లింగ్ ప్లాస్టిక్ సీసాల నుండి పానీయాలలోకి చేరిన 150 రసాయనాలు చేరుతున్నట్లు కనుగొన్నారు శాస్త్రవేత్తలు. వాటిలో 18 రసాయనాలు నిబంధనలను మించిన స్థాయిలో ఉన్నాయని తేల్చిచెబుతున్నారు. రీసైకిల్ చేయబడిన పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ (PET)ని ఉపయోగించి బాటిల్ చేసిన పానీయాలు, కొత్త PET బాటిల్స్ కంటే ఎక్కువ రసాయనాలను కలిగి ఉన్నాయని, మరో వైపు కాలుష్యానికి కూడా అతిపెద్ద కారణమవుతాయని సూచిస్తున్నాయి.

ప్లాస్టిక్ సీసాల నుండి రసాయన కాలుష్యం గురించి ప్రపంచవ్యాప్తంగా 91 అధ్యయనాలను పరిశోధకులు సమీక్షించారు. అధ్యయనానికి.. లండన్ బ్రూనెల్ యూనివర్సిటీ పరిశోధకురాలు డాక్టర్ ఎలెని ఇయాకోవిడౌ తన బృందంతో వెల్లడించిన విషయాలు ఆందోళన కల్గిస్తున్నాయి. ఇలాంటి రీసైక్లింగ్ బాటిళ్లలో పానీయాలు.. ఆహార పదార్థాలు ఉపయోగిస్తే.. జీవర్ణవ్యవస్థను దెబ్బతీయంతో పాటు ప్రాణాలు తీసే క్యాన్సర్ల భారిన పడే అవకాశం ఉందని హెచ్చిరికలు జారీచేశారు. దీనికంటే.. మానవ ప్రత్యుత్పత్తి ప్రక్రియ నాశనమవుతుందనే ఈ పరిశోధన వెల్లడించడం.. చివరికి మానవాళి మనుగడకే సవాల్ విసురుతోంది.

ఇంతకీ.. పెట్ బాటిళ్ల రీసైక్లింగ్ ఇంత పెద్ద డేంజరా విస్తరిస్తోందా? మరి మనదేశంలో దీని ప్రభావం ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో వీటి ప్రభావం ఎంత? అంటే.. ఇక్కడ కూడా నూటికి 80శాతానికి పైగా రీసైక్లింగ్ ప్రక్రియలు కొనసాగుతున్నాయి. అందుకే.. ఈ డేంజర్‌లో మనమూ ఉన్నామనే విషయాన్ని జెఎన్‌టియూ, ఉస్మానియా వంటి ప్రతిష్టాత్మక వర్సిటీల సైంటిస్టులు హెచ్చిరిస్తున్నారు.

ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఎన్ని అనర్థాలు తీసుకురావాలో.. అన్ని తీసుకువస్తోందంటున్నారు జేఎన్టీయూ హైదరాబాద్‌లో పర్యావరణంలో ప్లాస్టిక్ పై వివిధ పరిశోధనలు చేస్తున్న డాక్టర్ హిమబిందు. ప్లాస్టిక్ రీ యూసేజ్ లోనే అనేక డేంజర్ కెమికల్స్ బయటపడుతున్నాయి. మరి రీ సైక్లింగ్ ప్లాస్టిక్‌లో మరిన్ని అవశేషాలు చూస్తున్నాం అంటున్నారామె. అయితే.. ప్లాస్టిక్ పెట్ బాటిల్స్ ఒకసారి ఉపయోగించిన తరువాత.. అవి బలహీనమైపోతాయి. అందుకే.. రీ సైక్లింగ్‌లో మరో బాటిల్ తయారు చేయడానికి అనేక రసాయనాలను కలపాల్సి ఉంటుంది. అదే.. ఇప్పుడు అత్యంత డేంజర్ గా ఈ బాటిల్స్ ను మార్చేసిందంటున్నారు. లండన్ బ్రూనెల్ యూనివర్సిటీ కూడా ఇదే విషయాన్ని తేల్చిచెప్పిందంటున్నారు హైదరాబాద్ జేఎన్టీయు సైన్స్ అండ్ టెక్నాలజీ సైంటిస్ట్ డాక్టర్ హిమ బిందు.

ఎన్నో రకాల రసాయనాలు.. అవితిరిగి వాటిని ఉపయోగిస్తున్న వారిపైనే దాడిచేస్తున్నాయి. అది ఎంత అంటే.. ప్లాస్టిక్ ఉపయోగించడం వల్ల వాటి అవశేషాలు.. మనల్ని అనారోగ్యం పాలు చేయడం.. ప్రాణాలు తీయడమే కాదు.. చివరికి మన రక్తంలో సైతం కలిసిపోతున్నాయి. ప్లాస్టిక్ యూసేజ్ఎక్కువగా ఉన్న దేశాలు, ప్రాంతాలలో కొందరి రక్త నమూనాలు పరిశీలిస్తే వారి రక్తంలో సైతం ప్లాస్టిక్ అవశేషాలు కన్పిస్తూ ఆందోళన కల్గిస్తున్నాయని హెచ్చిరిస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీ ఎన్విరాన్ మెంట్ సైంటిస్ట్ ప్రొఫెసర్ శశికళ.

రీసైక్లింగ్ చేయడానికి ముందు పాత ప్లాస్టిక్‌లను శుభ్రం చేయడానికి మూడు దశల ప్రక్రియను ఉపయోగిస్తుంది. అధిక-ఉష్ణోగ్రత వాష్, గ్యాస్ వాష్, కెమికల్ వాష్. వీటివల్ల ఈ బాటిల్స్ ను ఉపయోగించడంలో దుష్ప్రభావాలతోపాటు.. మానవమనుగడను దెబ్బతీస్తున్నాయి. ఇందులో కీలకంగా బిస్ఫినాల్ A వంటి రసాయనాలు అత్యంత డేంజర్ అంటున్నారు. ఈ డేంజర్ రసాయనాలే PET బాటిళ్లు ద్వారా మానవ శరీరంలోనికి విస్తరిస్తున్నాయి. పునరుత్పత్తి లోపాలు, హృదయ సంబంధ సమస్యలు, క్యాన్సర్‌ వస్తున్నాయని పరిశోధనల్లో తేలిందంటున్నారు. అందుకే.. ఈపెట్ సీసాలు 2030 నాటికి కనీసం 30% రీసైకిల్ కంటెంట్‌ను కలిగి ఉండాలని పర్యావరణ పరిశోధన ఆదేశాలు తేల్చి చెబుతున్నాయి.

ప్లాస్టిక్ మానవ జీవితంతో పెనవేసుకుపోయింది. అందుకే ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయం ఆలోచించాల్సిన అవసరం ఉందంటున్నారు ఎన్విరాన్ సైంటిస్టులు. ప్లాస్టిక్ పర్యావరణానికి చేస్తున్న హాని అంతా ఇంతా కాదు. వీటిని రీయూసేజ్ చేయకూడదు. మరోవైపు రీ సైక్లింగ్ పద్దతులు ద్వారా వీటిని ఉపయోగించడం కూడా అత్యంతంత డేంజర్ గా పరిశోధనలు తేల్చుతున్నాయి. అందుకే.. ప్యూచర్ అంతా ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయం వెదకడంపై పరిశోధనలు సాగాల్సిన అవసరం ఉందంటున్నారు ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్‌లు.

ప్లాస్టిక్.. ప్లాస్టిక్… ఇంటి నాలుగు గోడల నుంచి ప్రపంచం నలుమూలలవరకూ ప్లాస్టిక్ లేని ఈ ప్రపంచం లేదు. ఎప్పటి నుంచో ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం గురించి ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా లండన్ బ్రూనెల్ యూనివర్సీటీ చేసిన పరిశోధనలతో డేంజర్ బెల్స్ మన ఇంటిలోనే మోగుతున్నాయి. మరి తెలుగు రాష్టాల్లో అందులో హైదరాబాద్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ కు ముడిసరుకును అందించే కేంద్రంగా ఉంది. ఇక్కడ సేకరణ ఎలా సాగుతుంది. ఏవిధంగా మనల్ని ప్లాస్టిక్ బాటిళ్ల గండం వెంటాడుతోంది.

ప్లాస్టిక్ బాటిళ్లు.. పెట్ బాటిల్స్ వినియోగం అయిన తరువాత.. వాటిని నూటికి 95శాతం పడేస్తారు. అంటే.. యూజ్ అండ్ త్రో. మరి ఇలాంటి వాటిని సేకరించి తిరిగి రీ సైక్లింగ్ చేసి మరో కొత్త ఉత్పత్తిని చేయడం అనేది ఇప్పుడు అతిపెద్ద ఇండస్ట్రీగా మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ ఒక ముఖ్య కేంద్రంగా ఉంది. ఇక్కడ కూకట్ పల్లి, రాజేంద్రనగర్, కాటేదాన్, బాచుపల్లి, పటాన్ చెరు ఇలా అనేక ప్రాంతాల్లో భారీ ఇండస్ట్రీగా ఇవి కొనసాగుతున్నాయి.

ప్లాస్టిక్ పెట్ బాటిళ్లను సేకరించిన తరువాత.. రీ సైక్లింగ్ కు ఉపయోగించేందుకే సిద్ధం చేస్తున్న యూనిట్లు చాలానే ఉన్నాయి. ముందుగా సేకరించిన యూజ్ అండ్ త్రో బాటిల్స్ ను ఒక చోట చేసి.. ఈ భారీ యంత్రాలు ద్వారా.. వాటిని రోలింగ్ చేసి… ఇలా బండిల్స్ గా తయారు చేస్తారు. దీనిలో రంగు.. రకం.. ఇలా బాటిళ్లను వేరుచేస్తారు. ఇంకా భారీ గా ఉండే బాటిళ్లు అయితే.. వాటిని కట్ చేస్తారు. ఇలా ప్రతి ప్యాక్టరీ నుంచి లక్షల సంఖ్యలో పెట్ బాటిళ్లు, బండిళ్లుగా ప్యాక్ చేసి.. లారీలు ద్వారా రీసైక్లింగ్ యూనిట్లకు పంపిస్తున్నారు. ఒక్క హైదరాబాద్ నుంచే కొన్ని వేల టన్నుల ప్లాస్టిక్ పెట్ బాటిళ్లు ఇలా బండిళ్లు గా మారి తరలిపోతున్నాయి.

పర్యావణం పేరుతో మనకు చాలా చోట్ల పచ్చదనం కన్పిస్తుంది. కానీ ఆపచ్చదనం ప్లాస్టిక్ చేస్తున్న అనర్ధాన్ని అడ్డుకోలేని స్థితి ఉంది. ఎందుకంటే.. ఎక్కడ చూసినా.. ప్లాస్టిక్ బాటిళ్ల ప్రపంచం కన్పిస్తుంది. తాగే నీటి నుంచి తినే ఆహారం.. కూల్ డ్రింక్సి వరకూ ఇలా మనకు పెద్ద ఎత్తున పెట్ బాటిళ్ల వినియోగం పెరిగిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే పైకి పచ్చదనం కనిపిస్తున్నా అంతర్లీనంగా ప్లాస్టిక్ విషయం కలసిపోతోంది. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ పెట్ బాటిళ్ల విచ్చలవిడి వినియోగాన్ని అరికట్టాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

– ( గణేష్‌.వై, టీవీ9 తెలుగు, హైదరాబాద్‌)

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu