లైసెన్స్ లేదని.. ట్రక్కు డ్రైవర్‌కు రూ. 86వేలు ఫైన్

Highest Challan Under New MV Act Comes From Odisha, లైసెన్స్ లేదని.. ట్రక్కు డ్రైవర్‌కు రూ. 86వేలు ఫైన్

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వాహన చట్టం.. వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఎప్పుడో రూల్స్ తప్పిన వారిపై ఇప్పుడు జరిమానా విధిస్తున్నారు. నిలుచోబెట్టి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. తాజాగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఓడిశాలో ఓ ట్రక్కు డ్రైవర్‌కు అక్షరాల 86,500 రూపాయలు జరిమానా విధించారు అక్కడి అధికారులు.

నాగాలాండ్‌కు చెందిన బీఎల్‌ఏ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన జేసీబీని ఛత్తీస్‌గఢ్‌కు తరలిస్తుండగా.. ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో పోలీసుల తనిఖీల్లో ట్రక్కును అధికారులు పట్టుకున్నారు. ట్రక్కు యజమాని అశోక్ జాదవ్‌కు భారీ ఫైన్ వేశారు. అశోక్‌కు లైసెన్స్ లేదని గుర్తించిన అధికారులు పెద్ద మొత్తంలో జరిమానా విధించారు. లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసినందుకు రూ. 5 వేలు, 18 వేల టన్నుల అదనపు బరువును తీసుకెళుతున్నందుకు రూ. 56 వేలు, పరిమితికి మించిన లోడుతో వెళుతున్నందుకు 50 వేల రూపాయలు, సాధారణ తప్పిదాలకు మరో 5వందల రూపాయలు, మొత్తం కలిపి రూ. 86,500 జరిమానా విధించారు. కాగా కొత్త వాహన చట్టం సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రాగా, ఒడిశా ప్రభుత్వం అదే రోజు నుంచి అమలులోకి తీసుకొచ్చింది. అయితే మొదటి నాలుగురోజుల్లోనే రూ. 88 లక్షలు జరిమానా కింద వసూలు చేసి.. దేశంలోనే అత్యధిక మొత్తం జరిమానా వసూలు చేసిన రాష్ట్రంగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *