ఒడిషా ఎమ్మెల్యేలకు కరోనా టెన్షన్‌.. తాజాగా మరొకరికి పాజిటివ్‌..

ఒడిషాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అన్‌లాక్‌ 1.0 తర్వాత రాష్ట్రంలో కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఇప్పటికే 13 వేల మార్క్‌ను దాటేసిన సంగతి తెలిసిందే. ఇక అన్ని రాష్ట్రాల్లో సోకుతున్నట్లుగానే ఒడిషాలో..

ఒడిషా ఎమ్మెల్యేలకు కరోనా టెన్షన్‌.. తాజాగా మరొకరికి పాజిటివ్‌..
Follow us

| Edited By:

Updated on: Jul 15, 2020 | 12:02 AM

ఒడిషాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అన్‌లాక్‌ 1.0 తర్వాత రాష్ట్రంలో కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఇప్పటికే 13 వేల మార్క్‌ను దాటేసిన సంగతి తెలిసిందే. ఇక అన్ని రాష్ట్రాల్లో సోకుతున్నట్లుగానే ఒడిషాలో కూడా సామాన్య ప్రజల నుంచి మొదలు ప్రజాప్రతినిధులను కూడా కరోనా వదలడం లేదు. తాజాగా రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్‌గా తేలింది. అధికార బీజేడీకి చెందిన రెమూనా నియోజకవగర్ ఎమ్మెల్యే సుధాన్షు శేఖర్‌ పరిదాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఒడిషా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఇటీవలే శేఖర్ పరిదా.. నీలగిరి బీజేపీ ఎమ్మెల్యే సుకాంత కుమార్‌ నాయక్‌ను కలుసుకున్నారు. ఆయనకు పాజిటివ్‌ అని రావడంతో.. అప్పటి నుంచి పరిదా హోం క్వారంటైన్‌లో ఉండిపోయారు. ఈ నెల 11వ తేదీన పరిదా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే మంగళవారం నాడు రిపోర్టుల్లో కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో వెంటనే ఆయన్ను బాలాసోర్ కరోనా ఆస్పత్రికి తరలించి.. అక్కడే చికిత్స అందిస్తున్నారు. అయితే శేఖర్ పరిదాతో పాటు నాయక్‌, సలీపూర్‌ ఎమ్మెల్యే ప్రశాంత్‌ బెహరాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. అయితే ఇప్పుడు వీరిని ఎవరెవరు కలిశారన్న దానిపై ఆరా తీస్తున్నారు.