మినిస్టర్ మేడమ్..వి సెల్యూట్ యూ!

Odisha Minister Tukuni Sahoo assists differently-abled kids, wins heart

రాష్ట్ర మంత్రి అంటే ఆ హంగు, ఆర్భాటాలు వేరు. ఎక్కడికి వెళ్లినా వీఐపీ ట్రీట్‌మెంట్, అనుయాయుల హడావిడి, పూల దండలు, సన్మానాలు  ఇవన్నీ ఉంటాయి. కానీ ఒడిస్సాకు చెందిన మహిళా మంత్రి ఇందుకు పూర్తి భిన్నం. తాను నిర్వర్తిస్తున్న మహిళ, శిశు సంక్షేమం, విద్యుత్ శాఖలకు ఆవిడ పూర్తి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆమె పేరు టికుని సాహూ.

ఇటీవల ఆవిడ చేసిన పనితో సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. టిట్లాగఢ్​లోని ఓ దివ్యాంగ బాలల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఆమె… పిల్లల కాళ్లకు కొత్త బూట్లు తొడిగి వారికి మరపురాని అనుభూతి మిగిల్చారు. సామాజిక మాధ్యమాల్లో ఆ ఫోటోస్ చక్కర్లు కొడుతున్నాయి. మంత్రి గారి మంచి మనసుకు పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *