బావిలో 15 అడుగుల కింగ్‌ కోబ్రా..!

ఒడిషాలో కింగ్ కోబ్రాలు కలకలం సృష్టిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా జనావాసల మధ్య కింగ్ కోబ్రాలు ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా రాష్ట్రంలోని గంజాం..

బావిలో 15 అడుగుల కింగ్‌ కోబ్రా..!
Follow us

| Edited By:

Updated on: Jul 23, 2020 | 10:04 AM

ఒడిషాలో కింగ్ కోబ్రాలు కలకలం సృష్టిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా జనావాసల మధ్య కింగ్ కోబ్రాలు ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా రాష్ట్రంలోని గంజాం జిల్లాలోని బురుజ్హరీ గ్రామంలోని ఓ బావిలో కింగ్ కోబ్రా కనిపించింది. బుధవారం నాడు పొలం దగ్గరికి వెళ్లిన యజమాని.. బావిలో చూడగా అందులో ఓ భారీ కింగ్ కోబ్రా కన్పించింది. దీంతో వెంటనే సమాచారాన్ని స్థానిక అటవీ శాఖ అధికారులకు, స్నేక్ రెస్క్యూ టీంలకు తెలియజేశాడు. వెంటనే గ్రామానికి చేరుకున్న ఇద్దరు స్నేక్ రెస్క్యూ టీం సభ్యులు గంటల తరబడి కష్టపడి కింగ్‌ కోబ్రాను బావి నుంచి బయటకు తీసి బంధించారు. ఆ తర్వాత దానిని కల్లికోటే అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఈ కింగ్ కోబ్రా దాదాపు పదిహేను అడుగుల పొడవు ఉందని స్నేక్ రెస్క్యూ టీం సభ్యులు తెలిపారు.