ఆ రాష్ట్రంలోని విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్.. 30 శాతం సిల‌బ‌స్ త‌గ్గింపు

క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో ఒడిశా రాష్ట్ర ప్ర‌భుత్వం విద్యార్థుల‌కు కాస్త‌ భారం త‌గ్గించింది. 1 నుండి 12వ త‌ర‌గ‌తుల వ‌ర‌కు 30 శాతం సిల‌బ‌స్‌ను త‌గ్గించింది. 2020-21 విద్యా సంవ‌త్స‌రానికి చెందిన 1 నుండి 12 త‌ర‌గ‌తుల వ‌ర‌కు పాఠ్యాంశాల‌ను 30 శాతం త‌గ్గించిన‌ట్లు రాష్ట్ర పాఠ‌శాల‌,..

ఆ రాష్ట్రంలోని విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్.. 30 శాతం సిల‌బ‌స్ త‌గ్గింపు
Follow us

| Edited By:

Updated on: Aug 26, 2020 | 5:05 PM

క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో ఒడిశా రాష్ట్ర ప్ర‌భుత్వం విద్యార్థుల‌కు కాస్త‌ భారం త‌గ్గించింది. 1 నుండి 12వ త‌ర‌గ‌తుల వ‌ర‌కు 30 శాతం సిల‌బ‌స్‌ను త‌గ్గించింది. 2020-21 విద్యా సంవ‌త్స‌రానికి చెందిన 1 నుండి 12 త‌ర‌గ‌తుల వ‌ర‌కు పాఠ్యాంశాల‌ను 30 శాతం త‌గ్గించిన‌ట్లు రాష్ట్ర పాఠ‌శాల‌, మాస్ ఎడ్యుకేష‌న్ విభాగం పేర్కొంది. నివేదిక‌ల ప్ర‌కారం మూడు క‌మిటీల ఆమోదంతో సిల‌బ‌స్‌ను తగ్గించే నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది. విద్యార్థులు తెలుసుకోవాల్సిన ముఖ్య అంశాల‌ను తొల‌గించ‌లేద‌ని వెల్ల‌డించింది.

ఈ సంద‌ర్భంగా ఒడిశా విద్యాశాఖ మంత్రి స‌మీర్ రంజ‌న్ దాస్ మాట్లాడుతూ.. ఒడిశా అకాడెమిక్ క్యాలెండ‌ర్ నుండి 30 శాతం సిల‌బ‌స్‌ను త‌గ్గించిన‌ట్లు పేర్కొన్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి సృష్టించిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో 2020-21 విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించి 9 నుంచి 12 త‌ర‌గ‌తుల సిల‌బ‌స్‌ను సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ సవ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇదే వ‌రుస‌లో ప్ర‌స్తుతం రాజ‌స్థాన్‌, గుజ‌రాత్, హ‌ర్యానా, పంజాబ్‌, ప‌శ్చిమ బెంగాల్, గోవా రాష్ట్ర విద్యా బోర్డులు సైతం పాఠ‌శాల సిల‌బ‌స్‌ను త‌గ్గించాల‌ని నిర్ణ‌యించాయి.

Read More:

డీప్ కోమాలోనే ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీః ఆర్మీ ఆస్ప‌త్రి వైద్యులు

బ్రేకింగ్ః తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డికి కోవిడ్ పాజిటివ్

ఆ ప్ర‌భుత్వ‌ ఉద్యోగులకు సీఎం జ‌గ‌న్‌ గుడ్ న్యూస్‌

బిగ్‌బాస్-4 కంటెస్టెంట్‌కి కరోనా పాజిటివ్?