ఒడిశాలో ఒక్కరోజే 571 మందికి కరోనా

ఒడిశా రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు అధికారులను మరింత కంగారుపెడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 571 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో నలుగురు మృతి చెందినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించింది.

ఒడిశాలో ఒక్కరోజే 571 మందికి కరోనా
Follow us

|

Updated on: Jul 07, 2020 | 1:56 PM

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరణ కొనసాగుతూనే ఉంది. రోజుకీ అంతకంతకు కేసుల సంఖ్య గణనీయంగా నమోదవుతుంది. ఇంతకాలం పట్టణాలకే పరిమితమైన వైరస్ గ్రామీణ ప్రాంతాలకు పాకుంది. దీంతో జనం ఉపిరాడక అల్లాడుతున్నారు. తాజాగా ఒడిశా రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు అధికారులను మరింత కంగారుపెడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 571 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో నలుగురు మృతి చెందినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 10,097కు చేరింది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం 3,557 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఇప్పటి వరకూ 6,486 మంది కరోనాతో కోలుకుని ఇళ్లకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, కరోనాను జయించలేక రాష్ట్రవ్యాప్తంగా 42 మంది కరోనాతో ప్రాణాలొదిలారని అధికారులు పేర్కొన్నారు.