Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

ఒడిశా సీఎం కీలక నిర్ణయం.. మహిళలకు 33 శాతం సీట్లు

, ఒడిశా సీఎం కీలక నిర్ణయం.. మహిళలకు 33 శాతం సీట్లు

లోక్‌సభ ఎన్నికల వేళ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేడీ తరపున పోటీ చేసే మహిళలకు 33 శాతం సీట్లు ఇస్తామని ప్రకటించారు. కేంద్రాపరాలో నిర్వహించిన మహిళా స్వయం సహాయ బ‌ృంద సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ … రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశా నుంచి పార్లమెంట్‌కు 33 శాతం మంది మహిళలు వెళ్లనున్నట్లు తెలిపారు. భారతదేశంలో మహిళలు సాధికరత సాధించే దిశగా ఒడిశాలోని మహిళలు నాయకత్వం వహిస్తారన్నారు నవీన్ పట్నాయక్. ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించాలన్నా, అమెరికా, చైనా దేశాల్లా అత్యాధునిక దేశం కావాలన్నా మహిళా సాధికారతే మార్గమన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పై విమర్శలు గుప్పించారు. మహిళా సాధికారత అంటూ వ్యాఖ్యాలు చేస్తున్న జాతీయ పార్టీలు కూడా తమ మాటపై నిలబడాలన్నారు. కాగా మహిళలకు లోక్‌సభ, శాసనసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా మద్దతు తెలుపుతూ గత ఏడాది నవంబరులో ఒడిశా అసెంబ్లీలో నవీన్ పట్నాయక్ ప్రతిపాదన తీర్మానాన్ని ఆమోదింప చేశారు. దీనికి బీజేపీ, కాంగ్రెస్‌ కూడా మద్దతు తెలిపాయి.