Liquor Sales – Huzurabad: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే ఎన్నికల వాతావరణం తలపిస్తుంది. హోరాహోరీ ప్రచారాలు చేస్తున్న అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు దావతుల పేరిట పార్టీలు ఏర్పాటు చేస్తూ మద్యం ఏరులై పారుతుంది. గడిచిన నాలుగు నెలల్లో పెరిగిన మద్యం విక్రయాలు చూస్తుంటే అధికారులే అవాక్కయి పోతున్నారు. గత ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు హుజూరాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట వీణవంక కమలాపూర్ ఇల్లందకుంట హుజురాబాద్ మండలాలలో120.94 కోట్ల మద్యం విక్రయాలు జరగగా.. ఈ ఏడాది 166.06 కోట్ల ఆదాయం సమకూరడం విస్మయాన్ని కలిగిస్తుంది.
కేవలం మందు అమ్మకాల వల్లే ఏకంగా 45.12 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. హుజురాబాద్, జమ్మికుంట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 29 దుకాణాలు ఉండగా వాటి అమ్మకాలలో ఊహించని జోరు పెరిగింది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాదిలో రూ. 306.37 కోట్ల ఆదాయం రాగా ఇందులో ఈ నియోజకవర్గం పరిధిలోనే 54 శాతం ఉండటం విశేషం! ఎన్నికల వాతావరణాన్ని తలపించేలా ఈ నియోజకవర్గం లోని గ్రామాలలో విచ్చలవిడిగా బెల్టు షాపులు అనూహ్యంగా పెరిగాయి ఇంతకుముందు గ్రామాలలో 3 నుంచి 4 బెల్టుషాపులు ఉండగా ప్రస్తుతం అవి ఒక్కో గ్రామంలో 10 కి చేరుకున్నాయి.
హోల్ సేల్ షాప్ నుండి ఆయా గ్రామాలకు మద్యం రవాణా చేయడానికి కొంతమంది వ్యక్తులను నియమించుకోవడం మద్యం ప్రియులకు నచ్చిన లిక్కర్,బీర్లను అందించడానికి కొన్ని షాపులలో ఖాతాలు తెరవడం చీటీల మీద రాసి ఇస్తే మద్యం బాటిల్ లో వచ్చే విధంగా ఏర్పాటు చేయడం ఈ నియోజకవర్గంలో కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు . అనూహ్యంగా మద్యం అమ్మకాలు పెరగడం ఒకవైపు అయితే గడిచిన నాలుగు నెలల్లో ఎక్సైజ్ శాఖ పరిధిలో ఒక్క కేసుకూడా నమోదు కాకపోవడం ఎక్సైజ్ శాఖ పనితీరు కు నిదర్శనంగా కనిపిస్తుంది.
Read also: Gold Scam: తక్కువ ధరకు బంగారం స్కాంలో విస్తుపోయే నిజాలు.. ఒక్కొక్కటీ బయటపెడుతోన్న నిందితురాలు నాగమణి