Rare Animal: ఐఎఫ్‌ఎస్ అధికారి షేర్ చేసిన ఈ ఫోటోలోని వింత జంతువు ఏంటో మీరు గుర్తించగలరా…?

ప్రపంచం వింత విషయాలతో నిండిపోయి ఉంది. అందులో మనకు కనిపించేవి కొన్ని అయితే.. అప్పుడప్పుడు తారసపడి మనని తికమకపెట్టేవి మరికొన్ని. ముఖ్యంగా కొన్ని జంతువుల

Rare Animal: ఐఎఫ్‌ఎస్ అధికారి షేర్ చేసిన ఈ ఫోటోలోని వింత జంతువు ఏంటో మీరు గుర్తించగలరా...?
ఈ జంతువు ఏంటో గుర్తించగలరా..?
Follow us

|

Updated on: Mar 09, 2021 | 4:55 PM

Clouded leopard: ప్రపంచం వింత విషయాలతో నిండిపోయి ఉంది. అందులో మనకు కనిపించేవి కొన్ని అయితే.. అప్పుడప్పుడు తారసపడి మనని తికమకపెట్టేవి మరికొన్ని. ముఖ్యంగా కొన్ని జంతువుల విషయంలో ఈ కన్‌ఫ్యూజన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత మొబైల్ యుగంలో కొత్తగా ఏమి కనిపించినా చాలు.. క్లిక్‌మనిపిస్తున్నారు. తాజాగా ఓ వింత జంతువు కెమెరా కంటికి చిక్కింది. అది ఏమిటా అని కనిపెట్టే పనిలో నెటిజన్లు తలమునకలయ్యారు. కానీ ఎవరూ స్పష్టతకు రాబోతున్నారు.

తాజాగా ఈ వింత జంతువు ఫోటో సోషల్ మీడియాలో తెగ సర్కలేట్ అవుతుంది. కొందరు దాన్ని చిరుతపులి అని అంటుండగా.. మరికొందరు కాదని వారిస్తున్నారు. కొందరేమో అదో ప్రత్యేకమైన జాతికి చెందిన పులి అంటున్నారు. కానీ అది ఏమిటన్నది మాత్రం స్పష్టత రావడం లేదు.  వాస్తవానికి చిరుత, పెద్ద పులి, లెపర్డ్ అన్ని పోలీకలు సదరు జంతువులో ఉన్నాయి. చర్మంపై ఉన్న మచ్చల ఆధారంగా దీనికి క్లౌడెడ్ చిరుతగా గుర్తించారు.

ఈ వింతగా కనిపించే జంతువు చిత్రాన్ని ఐఎఫ్‌ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.  ‘ఈ పెద్ద పిల్లిని ఎంత మంది గుర్తిస్తారో  చూడాలి. భారతదేశంలో లభించే అరుదైన జంతువులలో ఇది ఒకటి’ అని ఆయన సదరు పోస్ట్‌కు క్యాప్షన్‌ రాసుకొచ్చారు. ఈ అధికారి పోస్టుపై నెటిజన్ల నుంచి చాలా కామెంట్స్, రియాక్షన్స్ వస్తున్నాయి. కొంతమంది సరైన సమాధానం ఇచ్చి జంతువును గుర్తించగా, చాలా మంది దీనిని గుర్తించలేకపోయారు. భారతదేశంలోని సిక్కిం, వాయువ్య బెంగాల్, మేఘాలయ ఉపఉష్ణమండల అడవులు, త్రిపుర, మిజోరం, మణిపూర్, అస్సాం, నాగాలాండ్,  అరుణాచల్ ప్రదేశ్లలో మేఘాల చిరుతపులి (Clouded leopard) కనిపిస్తుంది.

Also Read:

దేత్తడి హారికకు భారీ షాక్.. టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో ఆమె నియామక వివరాలు తొలగింపు

INDvSA: స్మృతి మంధనా ఊచకోత, గోస్వామి మెరుపు బౌలింగ్.. 9 వికెట్ల తేడాతో ఓడిపోయిన దక్షిణాఫ్రికా