కాకినాడలో క్షుద్రపూజలు..!

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో అర్థరాత్రి ‘క్షుద్రపూజలు’ కలకలం రేపాయి. గొడారిగుంట సీతారామపురం కమ్యూనిటీ హాల్లో కొంతమంది అర్థరాత్రి క్షుద్రపూజలు చేస్తున్నారు. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, నాటు కోళ్ళుతో పూజలు నిర్వహించారు. గ్రామంలో అంతా నిద్రపోయాక కమ్యూనిటీ హాల్లో ఏదో జరుగుతోందని తెలుసుకున్న స్థానికులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆధునిక యుగంలో మూఢనమ్మకాల పేరుతో కాకినాడలో జరిగిన క్షుద్రపూజలపై అంతా భయాందోళనకు గురయ్యారు. పూజలు చేస్తున్నవారంతా మద్యం మత్తులో […]

కాకినాడలో క్షుద్రపూజలు..!
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 08, 2019 | 1:40 PM

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో అర్థరాత్రి ‘క్షుద్రపూజలు’ కలకలం రేపాయి. గొడారిగుంట సీతారామపురం కమ్యూనిటీ హాల్లో కొంతమంది అర్థరాత్రి క్షుద్రపూజలు చేస్తున్నారు. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, నాటు కోళ్ళుతో పూజలు నిర్వహించారు. గ్రామంలో అంతా నిద్రపోయాక కమ్యూనిటీ హాల్లో ఏదో జరుగుతోందని తెలుసుకున్న స్థానికులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ఆధునిక యుగంలో మూఢనమ్మకాల పేరుతో కాకినాడలో జరిగిన క్షుద్రపూజలపై అంతా భయాందోళనకు గురయ్యారు. పూజలు చేస్తున్నవారంతా మద్యం మత్తులో తూలుతున్నారు. ఇదేంటని..? పోలీసులు ప్రశ్నించగా.. తిక్కతిక్క సమాధానాలు చెప్పడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో 30 మంది యువకులు చనిపోయారని, వారి కోసమే తాము పూజలు చేస్తున్నామని.. ఇవి క్షుద్రపూజలు కావని నిందితులు అన్నారు. కాగా.. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.