ఊసరవెల్లిలా ఆక్టోపస్ రంగులు మార్చగలదా..!

రంగులు మార్చే జీవి ఏది అంటే వెంటనే ఊసరవెల్లి అని చెప్పేస్తారు. కానీ ఆక్టోపస్ కూడా రంగును మార్చగలదు. అయితే ఊసరవెల్లిలా ఎప్పుడుపడితే అప్పుడు మార్చకపోయినా.. నిద్రలో ఉన్నప్పుడు ఆక్టోపస్ శరీర రంగు మారిపోతోంది. కాంతిమయం నుంచి కాస్త నలుపురంగులోకి ఆక్టోపస్ తన రంగును మార్చుకుంటూ ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇటీవల బయటకు వచ్చింది. అయితే శత్రువు నుంచి తప్పించుకునేందుకు ఆక్టోపస్ తన శరీర ఆకృతిని తరచుగా మార్చుకునే విషయం తెలిసిందే కాగా.. నిద్రలో […]

ఊసరవెల్లిలా ఆక్టోపస్ రంగులు మార్చగలదా..!
Follow us

| Edited By:

Updated on: Mar 15, 2019 | 3:54 PM

రంగులు మార్చే జీవి ఏది అంటే వెంటనే ఊసరవెల్లి అని చెప్పేస్తారు. కానీ ఆక్టోపస్ కూడా రంగును మార్చగలదు. అయితే ఊసరవెల్లిలా ఎప్పుడుపడితే అప్పుడు మార్చకపోయినా.. నిద్రలో ఉన్నప్పుడు ఆక్టోపస్ శరీర రంగు మారిపోతోంది. కాంతిమయం నుంచి కాస్త నలుపురంగులోకి ఆక్టోపస్ తన రంగును మార్చుకుంటూ ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇటీవల బయటకు వచ్చింది.

అయితే శత్రువు నుంచి తప్పించుకునేందుకు ఆక్టోపస్ తన శరీర ఆకృతిని తరచుగా మార్చుకునే విషయం తెలిసిందే కాగా.. నిద్రలో కూడా అందుకే రంగును మార్చుకుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని గురించి బటర్‌ఫ్లై పెవీలియన్ జూలో పనిచేసే నిపుణురాలు సారా స్టీవెన్స్ మాట్లాడుతూ.. దీనిపై కచ్చితమైన పరిశోధన చేయాల్సి ఉందని చెప్పారు. ఆక్టోపస్‌లో రంగులను మార్చే కణాలు ఉంటాయని ఆమె అన్నారు. మాయం అయ్యేందుకు, శత్రువు నుంచి తప్పించుకునేందుకు ఒక పద్ధతిలో ఆక్టోపస్‌ రంగును తరుచుగా మారుస్తుంటుందని ఆమె తెలిపారు.

మామూలుగా ఆక్టోపస్ శరీరం అడుగుభాగాల్లో రంగులను మార్చే కణాలు ఉండగా.. వాటిని క్రోమోటోపోర్స్ అంటారు. అలాగే క్రోమోటోపర్స్ పై భాగంలో ఇరిడోపోర్స్, ల్యూకోపోర్స్ అనే రెండు కణాలు ఉంటాయి. ఇరిడోపోర్స్ ఆక్టోపస్ శరీరం లోపల ఆకుపచ్చ, నీలం, సిల్వర్, బంగారు రంగులను ఆక్టోపస్‌లోపల తయారు చేస్తే.. బయటి వాతావరణానికి అనుగుణంగా ల్యూకోపోర్స్ ఆ రంగులను మ్యాచ్ చేస్తూ ఉంటుంది. ఇలా ఆక్టోపస్‌పై రంగులు మారుతూ ఉండటం వలన శత్రువు అంత త్వరగా దానిపై దాడి చేయలేవని పరిశోధకులు చెబుతున్నారు.

అలాగే మనుషులతో పోలిస్తే ఆక్టోపస్‌లో చాలా మెదడులు ఉంటాయి. అవి కూడా శరీరంలో పలు స్థానాల్లో ఉంటూ అందులోని అన్ని భాగాలను అలర్ట్‌గా ఉంచుతుంటాయి. ఆక్టోపస్ నిద్రపోతోన్న సమయంలో దానికి ఎలాంటి హాని కలగకుండా మెదడులోని నరాలు శరీరంపై రంగు మార్చే ప్రక్రియను చేస్తాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో కలలో ఆక్టోపస్‌ ఏదైనా దాడికి గురైనప్పుడు ఇలా రంగులను మార్చుకుంటుదేమోనని అంటున్నారు.

https://www.dailymail.co.uk/sciencetech/article-6807801/Footage-captures-octopus-changing-colour-sleeps.html#v-8408689325678478977

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?