Breaking News
  • భారత్‌లో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 27,114 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
  • కృష్ణజిల్లా: వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో పోలీసులు దర్యాప్తు. నేడు పోలిస్ కస్టడీకి కీలక నిందితులు. చింతా నాంచారయ్య అలియాస్ చిన్ని ,చింత నాంచారయ్య అలియాస్ పులి విచారిచనున్న పోలీసులు.
  • తిరుపతి: చిత్తూరు జిల్లాలో తమ భూములను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు ను ఆశ్రయించిన అమర్ రాజా సంస్థ. ఏపీఐఐసీ నుంచి కొనుగోలు చేసిన భూముల్ని ప్రభుత్వం ఎలా లాక్కుంటుందని వాదన. అమర్ రాజా సంస్థలో 2700 కోట్లు పెట్టుబడి పెట్టాము. చెప్పిన దానికంటే ఎక్కువమందికి ఉద్యోగలిచ్చాము.
  • ప.గో : ఇ.యస్.ఐ స్కామ్ లో నిందితుడు పీతాని వెంకటసురేష్ కోసం తీవ్రంగా గాలిస్తున్న ఎసిబి అధికారులు. హైదరాబాద్ తో పాటు ఉభయగోదావరి జిల్లాల్లోనూ సురేష్ కోసం నిఘా. మాజీమంత్రి పి.యస్ మురళిమోహన్ను ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలింఛిన ఎసిబి. 2017-19 మధ్య మురళిమోహన్ పెండింగ్ బిల్లుల చెల్లింపు, డిస్ట్రిబ్యూటర్ ల నుంచి మందుల కొనుగోళ్లకు సంబంధించి కమిషన్లు దండుకున్నారంటున్న ఎసిబి.
  • నిమ్స్ లో క్లినికల్ ట్రయల్స్ మరో వారం రోజుల పాటు వాయిదా. పూర్తి స్థాయిలో సిద్ధమయ్యా అందుకే జాప్యం అంటున్న అధికారులు. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నాక క్లినికల్ ట్రయల్స్ నిలిపివేసిన అధికారులు. మూడు రోజుల పాటు నిర్వహించినక్లినికల్ ట్రయల్స్ ప్రాసెస్ .‌‌ అన్ని సిద్ధమయ్యా కే క్లినికల్ ట్రయల్స్ అంటున్న ఉన్నతాధికారులు.
  • షాబాద్ సీఐ శంకరయ్య ఇళ్ల‌లో ముగిసిన ఏసీబి సోదాలు. ఇన్‌స్పెక్ట‌ర్ ఇంట్లో, అత‌ని బందువుల ఇల్లలో కొన‌సాగిన ఏసీబి సోదాలు.
  • తిరుమల: శ్రీవారి దర్శనాలు పునరుద్ధరించి నేటికి నెల రోజులు పూర్తి. జూన్ 11 నుండి ప్రారంభమైన శ్రీవారి దర్శనాలు. నెలరోజుల్లో శ్రీవారిని దర్శించుకున్న 2,63,000 మంది భక్తులు. జూన్ 11 నుండి జూలై 10 హుండీ ద్వారా 15 కోట్ల 80 లక్షలు ఆదాయం వచ్చింది. లక్షమంది పైగా తలనీలాలు సమర్పించిన భక్తులు. కరోనా వైరస్ నివారణకు టిటిడి పటిష్ఠ చర్యలు. దర్శన క్యూలైన్లలో భౌతిక దూరం, మాస్కులు తప్పనిసరి చేసిన టిటిడి. క్యూలైన్ లో శానిటైజర్లు, లిక్విడ్ ఓజోన్ స్ప్రే ఏర్పాటు చేసిన టిటిడి. ఉద్యోగులలో కరోనా కేసులు నమోదు కావడంతో మరింత జాగ్రత్త చర్యలు. ఉద్యోగులకు ముమ్మరంగా కోవిడ్ టెస్టులు. రెండువారాలకు ఓసారి షిఫ్ట్ విధానం ప్రవేశ పెట్టిన టిటిడి.

ఓ..పిట్ట కథ :మూవీ రివ్యూ .

కొన్ని సినిమాలకు ఇండస్ట్రీ నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది. ఫ్రైడే రిలీజ్‌ అయిన 'ఓ పిట్ట కథ' కూడా అలాంటి చిత్రమే. ఈ సినిమాకు టైటిల్‌ పెట్టిందే త్రివిక్రమ్‌. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు చిరంజీవి సపోర్ట్ చేశారు. సినిమా ప్రమోషన్‌కు అనిల్‌ రావిపూడి టీమ్‌ని ఇంటర్వ్యూ చేశారు.
O Pitta Katha Movie Review, ఓ..పిట్ట కథ :మూవీ రివ్యూ .

నిర్మాణ సంస్థ: భవ్య క్రియేషన్స్
నటీనటులు: విశ్వంత్‌ దుడ్డుంపూడి, సంజయ్‌ రావు, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్‌ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు
కథ – స్క్రీన్‌ప్లే- మాటలు – దర్శకత్వం: చెందు ముద్దు
నిర్మాత: వి.ఆనందప్రసాద్‌
సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు
ఆర్ట్: వివేక్‌ అన్నామలై
ఎడిటర్‌: డి.వెంకట ప్రభు
కెమెరా: సునీల్‌ కుమార్‌.ఎన్‌.,
ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: అన్నేరవి
విడుదల: 06.03.2020
కొన్ని సినిమాలకు ఇండస్ట్రీ నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది. ఫ్రైడే రిలీజ్‌ అయిన ‘ఓ పిట్ట కథ’ కూడా అలాంటి చిత్రమే. ఈ సినిమాకు టైటిల్‌ పెట్టిందే త్రివిక్రమ్‌. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు చిరంజీవి సపోర్ట్ చేశారు. సినిమా ప్రమోషన్‌కు అనిల్‌ రావిపూడి టీమ్‌ని ఇంటర్వ్యూ చేశారు. ట్విట్టర్‌లో ఎన్టీఆర్‌ బెస్ట్ విషస్‌ చెప్పారు. ఉన్నట్టుండి ఓ చిన్న సినిమాకు ఇంతగా సెలబ్రిటీలు సపోర్ట్ చేయడానికి కారణం లేకపోలేదు. ఈ మూవీతో బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌రావు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. మరి ఇద్దరు హీరోలు, మధ్యలో హీరోయిన్‌తో నడిచే ఈ మూవీ ప్రేక్షకులకు నచ్చుతుందా?
కథ
పుట్టినప్పుడే తల్లిని పోగొట్టుకుంటుంది వెంకటలక్ష్మి (నిత్యాశెట్టి). తండ్రి గారాబంగా పెంచుకుంటాడు. వాళ్లున్న ఇల్లు, వెంకటలక్ష్మి పేరు మీద ఓ థియేటర్‌ తప్ప వారికి చెప్పుకోదగ్గ ఆస్తులు కూడా ఏమీ ఉండవు. తండ్రికి చెప్పకుండా ఏమీ చేయని వెంకటలక్ష్మి ఉన్నట్టుండి కనిపించకుండా పోతుంది. ఆమె మిస్‌ అయిన విషయాన్ని మేనల్లుడు (విశ్వంత్‌)తో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు ఆమె తండ్రి. స్టేషన్‌లో ఎస్‌.ఐ (బ్రహ్మాజీ)కి విశ్వంత్‌మీద అనుమానం వస్తుంది. అయితే వెంకటలక్ష్మికి, చైనా నుంచి వచ్చిన మేనల్లుడికి మధ్య ప్రేమ వ్యవహారం ఉందనీ, పెళ్లి నిశ్చయం అయిందని తెలుసుకుని అతన్ని వదిలేస్తాడు. ఈ స్టోరీ తెలుసుకునే క్రమంలోనే అతనికి థియేటర్‌లో పనిచేసే ప్రభు (సంజయ్‌రావు) గురించి తెలుస్తుంది. అతన్ని పిలిచి విచారించినప్పుడు కూడా ఓ లవ్‌స్టోరీ తెలుస్తుంది. అటు చైనా నుంచి వచ్చిన మేనల్లుడు, ఇటు ప్రభు… ఇద్దరూ తమని వెంకటలక్ష్మి ప్రేమిస్తుందని కచ్చితంగా చెబుతారు. ఇంతకీ వెంకటలక్ష్మి ఎవరిని ప్రేమించింది? తండ్రీ, కాలేజీ, థియేటర్‌ తప్ప బయటిప్రపంచం తెలియని ఆమెను ఎవరు ఏం చేశారు? చైనా మేనల్లుడు చెడ్డవాడా? ప్రభు కుట్రపన్నాడా? కూతురు కనిపించకపోవడంతో వెంకటలక్ష్మి తండ్రి ఏమయ్యాడు? వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు.
ప్లస్‌ పాయింట్లు
– స్క్రీన్‌ప్లే
– నటీనటుల పెర్ఫార్మెన్స్
– పచ్చటి లొకేషన్లు
– బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌
– ఇంట్రస్టింగ్‌ ట్విస్టులు
మైనస్‌ పాయింట్లు
– పదే పదే అదే సన్నివేశాలు రిపీట్‌ కావడం
– కాసింత కన్‌ఫ్యూజన్‌
విశ్లేషణ
సినిమాకు పెట్టిన టైటిల్‌, ట్యాగ్‌లైన్‌ పర్ఫెక్ట్ గా సరిపోయాయి. విశ్వంత్‌, నిత్యాశెట్టి, సంజయ్‌రావు ఎవరి పాత్రల్లో వాళ్లు బాగానే చేశారు. లొకేషన్లు కూడా నేచురల్‌గా ఉన్నాయి. ఇంటర్వెల్‌ పాయింట్‌ కూడా ఆకట్టుకుంటుంది. డైలాగులు నేచురల్‌గా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ప్లస్‌ అయింది. చిన్న చిన్న మార్పులతో సన్నివేశాలకు కొత్త అర్థాన్ని చెప్పడానికి చేసిన ప్రయత్నం బావుంది. ప్రతి క్యారక్టర్‌ తాలూకు ఒరిజినల్‌ స్వభావం బయటపడుతున్నప్పుడు థ్రిల్‌ కలుగుతుంది. అయితే అదే సమయం ఆ విషయాన్ని చెప్పడానికి చూపించిన సన్నివేశాలనే రిపీట్‌ చేయడం వల్ల కాస్త బోర్‌ ఫీలింగ్‌ కలుగుతుంది. విశ్వంత్‌
అమ్మాయిలను మోసం చేసి డబ్బులు సంపాదించినట్టు చూపించిన సన్నివేశాల్లో ఎక్కడో లాజిక్‌ మిస్‌ అయినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ సన్నివేశాల్లో ప్లాన్‌ మొత్తం అమ్మాయి తండ్రికి తెలుసని చెప్పడం, అతనిలోని కన్నింగ్‌ నెస్‌ ని చూపించడం అంత కన్విన్సింగ్‌గా అనిపించదు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురిని కన్నతండ్రే డబ్బు కోసం అలా వదిలేస్తాడంటే ఎందుకో నమ్మబుద్ధి కాదు. కాస్త వాస్తవానికి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే చెప్పాలనుకున్న కథను దర్శకుడు చక్కగా డీల్‌ చేశారు. మాస్‌ ఎలిమెంట్స్ పెద్దగా కనిపించవు. ట్విస్టులతో కూడిన స్క్రీన్‌ప్లేతో, ఏ సెంటర్లకు కనెక్ట్ అయ్యే కథ ఇది.
ఫైనల్‌గా… కన్‌ఫ్యూజన్‌ పిట్టకథ…!
– డా. చల్లా భాగ్యలక్ష్మి.

Related Tags