శభాష్ ‘శివా’… ఏడాదికి లక్ష డాలర్ల జీతం!

నూజివీడు ట్రిపుల్ఐటీ పూర్వ విద్యార్థి, మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన కుంటముక్కల శివరామకృష్ణ గూగుల్లో రూ.లక్ష డాలర్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించాడు. వివరాల్లోకెళితే.. కృష్ణా జిల్లా, మైలవరం మండలంలోని వెల్వడం గ్రామానికి చెందిన శివరామకృష్ణ.. అదే గ్రామంలోని లకిరెడ్డి పాపులమ్మ మెమోరియల్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలలో చదివాడు. పదోతరగతిలో 564 మార్కులు సాధించడం విశేషం. అనంతరం నూజివీడు ట్రిపుల్‌ఐటీలో సీటు సంపాదించాడు. ఎలక్ట్రానిక్‌ & కమ్యూనికేషన్‌ విభాగంలో ఇంజినీరింగ్‌ విద్య పూర్తిచేశాడు. 2014లో 9.27 […]

శభాష్ 'శివా'... ఏడాదికి లక్ష డాలర్ల జీతం!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 19, 2019 | 6:52 AM

నూజివీడు ట్రిపుల్ఐటీ పూర్వ విద్యార్థి, మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన కుంటముక్కల శివరామకృష్ణ గూగుల్లో రూ.లక్ష డాలర్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించాడు.

వివరాల్లోకెళితే.. కృష్ణా జిల్లా, మైలవరం మండలంలోని వెల్వడం గ్రామానికి చెందిన శివరామకృష్ణ.. అదే గ్రామంలోని లకిరెడ్డి పాపులమ్మ మెమోరియల్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలలో చదివాడు. పదోతరగతిలో 564 మార్కులు సాధించడం విశేషం. అనంతరం నూజివీడు ట్రిపుల్‌ఐటీలో సీటు సంపాదించాడు. ఎలక్ట్రానిక్‌ & కమ్యూనికేషన్‌ విభాగంలో ఇంజినీరింగ్‌ విద్య పూర్తిచేశాడు. 2014లో 9.27 గ్రేడ్‌ పాయింట్లతో బీటెక్‌ పూర్తిచేశాడు. అదే సంవత్సరం క్యాంపస్‌ సెలక్షన్స్‌లో టీసీఎస్‌లో ఉద్యోగం సంపాదించాడు.

టీసీఎస్‌లో రెండున్నరేళ్లు ఉద్యోగం చేశాడు. టీసీఎస్‌ సంస్థకు, అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో ఉన్న కార్నెగీ మెల్లన్‌ విశ్వవిద్యాలయం (సీఎంయూ) మధ్య అవగాహన ఒప్పందం ఉండటంతో.. సీఎంయూ మద్ధతుతో ప్రపంచస్థాయి ప్రోగ్రామర్‌‌గా ఎదిగాడు. 2019లో సీఎంయూ నుంచి టాప్ మార్కులతో ఎంఎస్‌ పట్టా కూడా అందుకున్నాడు. ఇటీవలే గూగుల్‌లో లక్ష డాలర్ల వార్షిక వేతనంతో ఉద్యోగం దక్కించుకున్నాడు. ఉద్యోగంలో భాగంగా ఓ అంకుర సంస్థ కోసం నాసా ఇంజినీర్లతో కలిసి పనిచేసే ఛాన్సును కొట్టేశాడు.

తన విజయం పట్ల ఆనందం వ్యక్తంచేసిన శివ.. తల్లిదండ్రులు తనను సొంత బిడ్డగా ఆదరించి, విద్యలో ప్రోత్సహించిన లకిరెడ్డి హనిమిరెడ్డి దంపతులకు కృతజ్ఞతలు తెలిపాడు. సీఎంయూలో చదవగలగడం తన అదృష్టమని.. ఇప్పుడీ స్థితిలో ఉండటానికి అక్కడి ప్రొఫెసర్ల ప్రోత్సాహమే కారణమని తెలిపాడు.

ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు