Breaking News
  • విశాఖ: సింహాద్రి అప్పన్నస్వామికి స్వర్ణ తులసీ దళాలు సమర్పణ. రూ.25 లక్షలు విలువైన 50 స్వర్ణ తులసీ దళాలు సమర్పించిన బోకం శ్రీనివాసరావు దంపతులు. గతంలోనూ పలు కానుకలు సమర్పించిన శ్రీనివాసరావు.
  • అమరావతి: ఓఎన్‌జీసీ, గెయిల్‌ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి భేటీ. మత్స్యకారులకు చేయూతనివ్వాలని కోరిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కార్పొరేట్‌ రెస్పాన్స్‌బిలిటీ కింద 2శాతం చెల్లించాలని కోరిన మంత్రి. గతంలో రూ.150 కోట్లు ఇస్తామని ఓఎన్‌జీసీ, గెయిల్‌ అంగీకారం. బకాయిలు రూ.82.12 కోట్లు వెంటనే చెల్లించాలని కోరిన పెద్దిరెడ్డి. ఆయిల్ నిక్షేపాల వెలికితీత సమయంలో మత్స్య సంపదకు నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన.
  • తిరుపతి: మీడియాతో మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి చిట్‌చాట్‌. పీసీసీ చీఫ్‌ పదవి మీడియా ఊహగానాలేనన్న కిరణ్‌కుమార్‌రెడ్డి. పీసీసీ చీఫ్‌ పదవిపై అంతగా ఆసక్తి లేదన్న మాజీ సీఎం. తాజా రాజకీయాల తీరుపై తీవ్ర అసంతృప్తి. తాను తిరుపతిలో తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించానన్న కిరణ్‌. చిత్తూరు జిల్లాలో తాను ప్రారంభించిన తాగు, సాగు నీరు ప్రాజెక్టు కొనసాగించకపోవడం పట్ల ఆవేదన. తిరుపతిలో అంతర్జాతీయ స్టేడియం నిర్మించకపోవడంపై అసంతృప్తి.
  • సైదాబాద్‌ పీఎస్‌లో అక్బరుద్దీన్‌పై కేసునమోదు. అక్బరుద్దీన్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని సైదాబాద్‌ పోలీసులను ఆదేశించిన నాంపల్లి కోర్టు. భారత దేశ సార్వభౌమత్వాన్ని సవాల్‌ చేసిన అక్బరుద్దీన్‌. న్యాయవాది కరుణసాగర్‌ ఫిర్యాదుతో కేసునమోదు.
  • గుంటూరు: దుర్గి మండలం ధర్మవరంలో జనసేన నేతల పర్యటన. బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలకు పరామర్శ. గ్రామంలో తిరునాళ్ల సందర్భంగా పోలీసులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ. గురజాల డీఎస్పీ శ్రీహరిని కలిసిన జనసేన నేతలు. గొడవతో సంబంధం లేని వారిని కేసుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి. గురజాల సబ్‌జైలులో ఉన్న ధర్మవరం జనసైనికులకు పరామర్శ.
  • తూ.గో: రాజమండ్రి దగ్గర పురాతన హెవలాక్‌ బ్రిడ్జిని పరిశీలించిన ఎంపీ మార్గాని భరత్‌, టూరిజం ఎండీ ప్రవీణ్‌కుమార్‌. హెవలాక్‌ బ్రిడ్జిని పర్యాటక కేంద్రంగా తీర్చుదిద్దనున్న ప్రభుత్వం. వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌, ఫుడ్‌బజార్‌, ఫ్యాషన్‌ బజార్లకు ఏర్పాటు. 40 అడుగుల మేర ట్రాక్‌ ఏర్పాటు చేయాలని కోరిన ఎంపీ. త్వరలో పనులు ప్రారంభిస్తామన్న ఎండీ ప్రవీణ్‌కుమార్‌.

మీరు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా..?

Nutritional supplements 'don't work' and taking certain ones even increases the risk of dying from cancer, professor warns, మీరు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా..?

మన శరీరానికి విటమిన్లు ఎంత అవసరమో.. దాని వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయో.. మనందరికీ తెలిసిన విషయమే. శరీరానికి కావాల్సిన పోషణకు, అనారోగ్య సమస్యలను దూరం చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. అయితే.. ఇది డాక్టర్ సూచన మేరకే వాడాల్సి ఉంటుంది. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఎవరికి వారు సొంతంగా ఈ విటమిన్ ట్యాబ్లెట్లను తీసుకుంటున్నారు. దీంతో చాలా ప్రమాదాలు ఉంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ ట్యాబెట్లు.. ఉన్న సమస్యను నివారించాల్సింది పోయి మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చే ప్రమాదముందని తెలిపారు.

రోజుకు 100 గ్రాముల మోతాదు వరకు మాత్రమే ఈ ట్యాబ్లెట్లను తీసుకోవాలి. ఈ మోతాదు మించితే నాడులు డ్యామేజ్ అవుతాయి. దీంతో.. చర్మ వ్యాధులు, అసిడిటి, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. అయితే.. వీటి బదులు చేపలు, ఆలుగడ్డలు, అవకాడోలు, పిస్తా పప్పు తింటే సరిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

శాస్త్రవేత్త డాక్టర్ ఫాంగ్ జాంగ్ ప్రకారం.. ‘పోషకాలు ఆహారంగా తీసుకుంటే.. మంచిదని.. ట్యాబ్లెట్స్ రూపంలో దానిని తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదని అన్నారు. అలాగే.. విటమిన్ డి ట్యాబ్లెట్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల మరణానికి కూడా దారితీస్తుందని కనుగొన్నారు.

కాగా.. బ్రిటీష్ న్యూట్రిషన్ ఫౌండేషన్  ప్రొఫెసర్ జూడీ బట్ట్రిస్ కనుగొన్న దాని ప్రకారం.. విటమిన్ ట్యాబ్లెట్స్ మరణాన్ని వీలైనంతగా దరిచేరనీయకుండా ఉండే ప్రయత్నం చేస్తాయని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే అన్ని రకాల విటమిన్లు అందుతాయని చెప్పి కొందరు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లను డాక్టర్ సూచన లేకుండానే వేసుకుంటున్నారు. అయితే.. వీటి మోతాదు గనక శరీరంలో ఎక్కువైతే.. హార్ట్ ఎటాక్‌లు, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి.. ఆచి తూచి వ్యవహరించడం మంచిది. సమస్య చిన్నదైనా.. పెద్దదైనా.. డాక్టర్లను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది.