నూతన్ నాయుడుకు బెయిల్.. సెంట్రల్‌ జైలు నుంచి విడుదల

శిరోముండనం కేసుతో పాటు పలు కేసుల్లో అరెస్టైన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, వ్యాపారవేత్త నూతన్‌నాయుడు సెంట్రల్‌ జైలు నుంచి బయటకు వచ్చాడు.

నూతన్ నాయుడుకు బెయిల్.. సెంట్రల్‌ జైలు నుంచి విడుదల
Follow us

| Edited By:

Updated on: Nov 18, 2020 | 2:09 PM

Nutan Naidu bail: శిరోముండనం కేసుతో పాటు పలు కేసుల్లో అరెస్టైన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, వ్యాపారవేత్త నూతన్‌నాయుడు సెంట్రల్‌ జైలు నుంచి బయటకు వచ్చాడు. కోర్టు ఆదేశాలతో బెయిల్‌పై నూతన్ నాయుడును జైలు అధికారులు విడుదల చేశారు. (‘ఆర్‌ఆర్‌ఆర్’‌కి చిన్న బ్రేక్‌.. ఫ్యామిలీతో దుబాయ్‌కి వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్‌)

కాగా ఏపీలో సంచలనం సృష్టించిన దళిత యువకుడి శిరోముండనం కేసులో నూతన్‌ నాయుడు ఏ8గా ఉన్నాడు. ఇక అతడు పారిపోతుండగా.. సెప్టెంబరు 3న బెంగుళూరు ఉడుపిలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత నూతన్ నాయుడు మోనాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. శిరోముండనంతో పాటు ఉద్యోగాల పేరుతో మోసం చేయడం, ఉన్నతాధికారి పేరుతో పలువురికి కాల్స్ చేసినట్టు నూతన్ నాయుడు పై అభియోగాలు వచ్చాయి. (రోడ్డు ప్రమాదం.. ప్రముఖ లిరిసిస్ట్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు)

ఈ క్రమంలో అతడిపై 3 అట్రాసిటీ సహా 7 కేసులను పోలీసులు నమోదు చేశారు. పెందుర్తిలో 3 , గోపాలపట్నం, కంచరపాలెం, గాజువాక, మహారాణిపేట పీఎస్‌లలో ఒక్కో కేసు నమోదైంది. ఇక ఈ అన్ని కేసుల్లో నూతన్‌ నాయుడుకు బెయిల్‌ మంజూరైంది. కాగా దాదాపు 70 రోజుల పాటు నూతన్‌ నాయుడు జైల్లో ఉన్నాడు. మరోవైపు శిరోముండనం కేసులో నూతన్‌ నాయుడు భార్య సహా మిగిలిన ఏడుగురు ఆ మధ్యనే బయటికి వచ్చేశారు. (పెరిగిన సోనూసూద్‌ క్రేజ్.. ‘ఆచార్య’ పాత్రలో పలు మార్పులు..!)