బ్రెజిల్‌లో కరోనా బీభత్సం.. 15 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు..

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. గడిచిన 24 గంటల్లో బ్రెజిల్ వ్యాప్తంగా 42,223 కరోనా కేసులు నమోదయ్యాయి.

బ్రెజిల్‌లో కరోనా బీభత్సం.. 15 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు..
Follow us

| Edited By:

Updated on: Jul 04, 2020 | 11:06 PM

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. గడిచిన 24 గంటల్లో బ్రెజిల్ వ్యాప్తంగా 42,223 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసులు సంఖ్య 15,39,081కు చేరింది. అంతకుముందు రోజు నమోదైన 48,105 కేసులతో పోల్చితే కొత్తగా నమోదైన కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నట్టు చెప్పాలి. మరోపక్క గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 1,290 మంది మరణించినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 63,174కు చేరింది.

కాగా.. కోవిద్-19 కట్టడికోసం బ్రెజిల్ ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కేసులు మాత్రం తగ్గడం లేదు. బ్రెజిల్ లో ఇప్పటివరకు 8,68,000 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. అత్యధిక కేసులు నమోదైన దేశంగా మొదటి నుంచి అమెరికానే మొదటి స్థానంలో ఉంది. అమెరికాలో ఇప్పటివరకు 27 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.

Also Read: యాంటీ-వైరల్ డ్రగ్ రెమ్డిసివిర్ డోసేజ్‌లో మార్పులు: కేంద్రం