Breaking News
  • ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించిన సర్వే ఆఫ్‌ ఇండియా. జమ్ము-కశ్మీర్‌ విభజన తర్వాత విడుదల చేసిన కొత్త మ్యాప్‌లో ఏపీ రాజధానిగా ఏ నగరాన్ని చూపని సర్వే ఆఫ్‌ ఇండియా. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన పత్రాల ఆధారంగా అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ కొత్తమ్యాప్‌ విడుదల చేసిన సర్వేఆఫ్‌ ఇండియా.
  • యాదాద్రి: బైక్‌ను ఢీకొన్న గూడ్స్‌ రైలు. భర్త రాంరెడ్డి మృతి, భార్య రాధకు తీవ్రగాయాలు. భువనగిరి మండలం రాయగిరి రైల్వేస్టేషన్‌ దగ్గర ఘటన.
  • పార్టీ మారతారన్న వార్తలపై స్పందించిన మంత్రి ఈటల. నేను పార్టీ మారను-మంత్రి ఈటల. గాలి వార్తలపై నేను స్పందించను. చెప్పే వాళ్లు ఎన్నైనా చెప్తారు-మంత్రి ఈటల.
  • సుజనాచౌదరి వ్యాఖ్యలకు మంత్రి మోపిదేవి కౌంటర్‌. గోడ దూకే ఎంపీలెవరూ వైసీపీలో లేరు. జగన్‌పై ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంపూర్ణ విశ్వాసం ఉంది. తిరుమలను ఆర్ధిక వనరుగా భావించే ఆలోచన ప్రభుత్వానికి లేదు -మంత్రి మోపిదేవి వెంకటరమణ.
  • ఈ ప్రపంచంలో దేనికైనా రంగులు వేయొచ్చు కష్టానికి తప్ప. అమరావతిని అంతర్జాతీయ పటంలో పెట్టింది చంద్రబాబు. అమరావతిని చేర్చి సర్వే ఆఫ్‌ ఇండియా కొత్త మ్యాప్‌ విడుదల చేసేలా లోక్‌సభలో పోరాడిన గల్లా జయదేవ్‌కు అభినందనలు-ట్విట్టర్‌లో నారా లోకేష్‌

RRR: ‘డబ్బింగ్ మాస్టర్’.. యంగ్‌ టైగర్..!

NTR to Dub in Four Languages for RRR?, RRR: ‘డబ్బింగ్ మాస్టర్’.. యంగ్‌ టైగర్..!

‘బాహుబలి’ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న మరో భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ హీరోలుగా ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవగన్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ బల్గేరియాలో శరవేగంగా జరుగుతోంది. అందులో ఎన్టీఆర్‌తో పాటు పలువురిపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇదిలా ఉంటే క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది.

అదేంటంటే ఈ మూవీని తెలుగులో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని భాషల్లోనూ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. తెలుగు భాషలో మంచి పట్టున్న ఎన్టీఆర్‌కు తమిళం, హిందీతో కూడా మంచి టచ్ ఉంది. ఇక తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పడం వల్ల సినిమాలో ఫీల్ కూడా బావుంటుందని భావించిన ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక యంగ్ టైగర్ తీసుకున్న ఈ నిర్ణయానికి జక్కన్న కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

కాగా ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనుండగా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. చెర్రీ సరసన అలియా భట్ కనిపించనుంది. దాదాపు 250కోట్లతో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.