ఎన్టీఆర్ సరసన మహేష్ హీరోయిన్… త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వానీ…

భరత్ అనే నేను, వినయ విధేయ రామా… సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఎన్టీఆర్ సరసన నటించనున్నట్లు సమాచారం.

  • Umakanth Rao
  • Publish Date - 8:14 pm, Fri, 27 November 20

భరత్ అనే నేను, వినయ విధేయ రామా… సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఎన్టీఆర్ సరసన నటించనున్నట్లు సమాచారం.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ‘అరవింద సమేత’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌‌లో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. అయితే ఇందులో తారక్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారన్న దానిపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. కథానాయికగా రష్మిక మందానాను ఫైనల్ చేసినట్లు రెండ్రోజుల క్రితమే ప్రచారం జరిగింది.

అయితే తాజాగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ పేరు తెరపైకి వచ్చింది. ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామా’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కియారా అయితే ఎన్టీఆర్ సరసన బాగుంటుందని త్రివిక్రమ్ ఆలోచనగా తెలుస్తోంది. ఈ రోల్ గురించి చెప్పగానే కియారా కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ న్యూస్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.