ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేధింపులు.. నటి మీరా చోప్రా పెట్టిన‌ కేసు ఢిల్లీకి బదిలీ..

జూనియర్‌ ఎన్టీఆర్ ఫ్యాన్స్, న‌టి మీరా చోప్రా మ‌ధ్య వివాదం ముదురుతోంది. ట్విటర్‌ వేదికగా తార‌క్ ఫ్యాన్స్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మీరా బుధవారం ట్విటర్‌ ద్వారా చేసిన కంప్లైంటుపై హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేధింపులు.. నటి మీరా చోప్రా పెట్టిన‌ కేసు ఢిల్లీకి బదిలీ..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 05, 2020 | 1:13 PM

జూనియర్‌ ఎన్టీఆర్ ఫ్యాన్స్, న‌టి మీరా చోప్రా మ‌ధ్య వివాదం ముదురుతోంది. ట్విటర్‌ వేదికగా తార‌క్ ఫ్యాన్స్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మీరా బుధవారం ట్విటర్‌ ద్వారా చేసిన కంప్లైంటుపై హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. నటి ట్విటర్‌లో అధిక సంఖ్య‌లో ట్వీట్‌లు ఉండగా.. అందులో ఎనిమిది ట్విటర్‌ అకౌంట్ల నుంచే ఆమెకు అసభ్యకరమైన కామెంట్స్ వచ్చినట్లుగా సైబర్‌ పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఇందులో ఎన్‌టీఆర్‌భీమ్‌99, గణేస్‌ వంటి అకౌంట్లు ఉన్నాయన్నారు. ఇప్పటికే వీరిపై ఐటీ యాక్ట్‌ 67, 509, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, తాజాగా ’67ఎ’ సెక్షన్‌ను కూడా యాడ్ చేసిన‌ట్టు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో నివ‌శిస్తున్నందున‌ ఈ కేసును అక్కడికే బదిలీ చేస్తున్నామని వెల్ల‌డించారు.

ఏం జ‌రిగిందంటే…

ఇటీవ‌ల #AskMeera చాట్ లో భాగంగా త‌న‌కు ఇష్టమైన హీరో మ‌హేశ్ అని.. ఎన్టీఆర్ ఎవ‌రో తెలియ‌దని మీరా చోప్రా పేర్కొన‌డం తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. ఈ వ్యాఖ్య‌ల‌పై తీవ్ర స్థాయిలో ఫైర‌యిన కొంద‌రు ఎన్టీఆర్ ఫ్యాన్స్.. మీరా చోప్రాని ట్రోల్ చేస్తూ అస‌భ్య‌ప‌ద‌జాలంతో దూషించారు‌. ఈ ఇష్యూపై ఆమె హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్‌లో పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. అంతేకాదు ఇటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఎలా నెగ్గుకురాగ‌ల‌రో తెలిపాలంటూ జూనియ‌ర్ ఎన్టీఆర్ ను ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శ్నించింది.