కార్వీ స్టాక్ బ్రోకింగ్ లైసెన్సు రద్దు

ఇన్వెస్టర్ల నిధులను మళ్లించి రూల్స్ ని అతిక్రమించిన కార్వీ స్టాక్ బ్రోకింగ్స్ లైసెన్సును ఎన్ఎస్ఈ రద్దు చేసింది. కేపిటల్ మార్కెట్, ఫ్యూచర్స్, ఆప్షన్, కరెన్సీ, డిరైవేటివ్స్ , డెట్ (రుణాలు), కమోడిటివ్ డిరైవేటివ్ సెగ్మెంట్ రంగాల్లో ఈ సంస్థ ట్రేడింగ్ లావాదేవీలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టింది. కార్వీతో సంబంధం ఉన్న ఇన్వెస్టర్లు ఇతర బ్రోకర్స్ ని ఆశ్రయించవచ్చునని పేర్కొంది. తన క్లయింట్ల నిధులను కార్వీ.. ఇతర ప్రయోజనాలకు మళ్లించిందని ఎన్ఎస్ఈ (నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజ్ […]

కార్వీ స్టాక్ బ్రోకింగ్ లైసెన్సు రద్దు
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 02, 2019 | 4:32 PM

ఇన్వెస్టర్ల నిధులను మళ్లించి రూల్స్ ని అతిక్రమించిన కార్వీ స్టాక్ బ్రోకింగ్స్ లైసెన్సును ఎన్ఎస్ఈ రద్దు చేసింది. కేపిటల్ మార్కెట్, ఫ్యూచర్స్, ఆప్షన్, కరెన్సీ, డిరైవేటివ్స్ , డెట్ (రుణాలు), కమోడిటివ్ డిరైవేటివ్ సెగ్మెంట్ రంగాల్లో ఈ సంస్థ ట్రేడింగ్ లావాదేవీలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టింది. కార్వీతో సంబంధం ఉన్న ఇన్వెస్టర్లు ఇతర బ్రోకర్స్ ని ఆశ్రయించవచ్చునని పేర్కొంది. తన క్లయింట్ల నిధులను కార్వీ.. ఇతర ప్రయోజనాలకు మళ్లించిందని ఎన్ఎస్ఈ (నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజ్ ) దర్యాప్తులో వెల్లడైంది. ఇక బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజ్ కూడా తన నిబంధనలను అతిక్రమించినందుకు కార్వీ స్టాక్ బ్రోకింగ్స్ ని సస్పెండ్ చేయడం విశేషం.

ఈ నెల 2 నుంచి ఈ సంస్థ ట్రేడింగ్ టర్మినల్స్ ను తాము డీయాక్టివేట్ చేస్తున్నట్టు బీఎస్ఈ తన సర్క్యులర్ లో వెల్లడించింది. రూ. 2 వేల కోట్ల మేర క్లయింట్ల నిధులను ఎగవేసి డీఫాల్టర్ అయిన ఈ సంస్థను ‘ సెబీ ‘ ఇటీవల బ్యాన్ చేసింది. అలాగే కొత్త క్లయింట్లను చేర్చుకోవడాన్ని, ప్రస్తుత కస్టమర్ల ట్రేడింగ్ లావాదేవీల కొనసాగింపును కూడా సెబీ నిషేధించింది. కాగా- సెటిల్మెంట్ కోసం సెక్యూరిటీల టెండరింగ్ కు తమను అనుమతించాలని కార్వీ.. సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. మరోవైపు-క్లయింట్లకు పవరాఫ్ అటార్నీ అధికారాన్ని ఇవ్వడానికి ఈ సంస్థను అనుమతించాలా, వద్దా అన్న విషయాన్ని తెలియజేయాలని సెబీని ఈ ట్రిబ్యునల్ కోరింది. కార్వీ స్టాక్ బ్రోకింగ్స్ ఇచ్ఛే ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోరాదని సెబీ.. డిపాజిటర్లకు కూడా సూచించింది.

ఇదిలా ఉండగా.. కార్వీ స్టాక్ బ్రోకింగ్స్ లో మొదట అనుకున్నదానికన్నా చాలా ఎక్కువగా నిధుల దుర్వినియోగం జరిగినట్టు తేలింది. ఇది దాదాపు రూ. 2,800 కోట్లని తాజా ఇన్వెస్టిగేషన్ లో వెల్లడైంది. దీనిపై దర్యాప్తు చేస్తున్న ఇద్దరు అధికారులు ఈ విషయం చెప్పారు. కార్వీకి సుమారు పది లక్షల మందికి పైగా క్లయింట్లు ఉన్నారు. వీరిలో మూడు లక్షలమంది యాక్టివ్ గా ఉన్నట్టు తెలిసింది. రోజువారీగా 20 వేల నుంచి 25 వేలమంది క్లయింట్లు లావాదేవీలు జరుపుతుంటారట. రూ. 2,300 కోట్ల విలువైన సెక్యూరిటీలను ఈ సంస్థ అనధికారికంగా బదిలీ చేసిందని, ఇవి 95 వేలమందికి పైగా క్లయింట్లకు చెందినవని సమాచారం. ప్రస్తుతం ఖఛ్చితంగా ఎంతమేర దుర్వినియోగం జరిగిందన్నదానిపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తున్నారు. అయితే క్లయింట్ల ఫండ్స్ దుర్వినియోగం జరిగినట్టు వచ్చిన వార్తలను కార్వీ ఖండించింది. రూ. 50 కోట్ల మేర నిధులు మాత్రమే పెండింగులో ఉన్నట్టు ఈ సంస్థ పేర్కొంది.

మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??