“ఆడ‌పిల్ల‌లే బంగారం”..ద‌త్త‌త‌లో మహాలక్ష్మిల వైపే దంప‌తుల మొగ్గు

ఆడ‌పిల్ల‌లంటే అలుసు, చిన్న‌చూపు..ఇవ‌న్నీ ఒకప్ప‌టి రోజులు. ఇప్పుడు ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. అమ్మాయిలే అన్ని రంగాల‌లో రాణిస్తున్నారు. చదువుల్లో ఉత్తీర్ణ‌త శాతం గ‌మ‌నిస్తే..ఎప్పుడూ అబ్బాయిల కంటే ముందుంటున్నారు.

ఆడ‌పిల్ల‌లే బంగారం..ద‌త్త‌త‌లో మహాలక్ష్మిల వైపే దంప‌తుల మొగ్గు
Follow us

|

Updated on: Jul 11, 2020 | 4:23 PM

ఆడ‌పిల్ల‌లంటే అలుసు, చిన్న‌చూపు..ఇవ‌న్నీ ఒకప్ప‌టి రోజులు. ఇప్పుడు ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. అమ్మాయిలే అన్ని రంగాల‌లో రాణిస్తున్నారు. చదువుల్లో ఉత్తీర్ణ‌త శాతం గ‌మ‌నిస్తే..ఎప్పుడూ అబ్బాయిల కంటే ముందుంటున్నారు. ప్ర‌తి రంగంలో అడుగుపెడుతూ అద్బుతాలు క్రియేట్ చేస్తున్నారు. ఈ విష‌యాన్ని అర్థం చేసుకున్నారు కాబ‌ట్టే తమ ఇళ్లలో సంతోషాలు నింపే మ‌హారాణులను ప్రవాసాంధ్రులూ ద‌త్త‌త తీసుకుంటున్నారు. గ‌తేడాది అయిదుగురిని స్పెయిన్‌, నలుగురిని మాల్టా, ముగ్గుర్ని యూఎస్ కి చెందినవారు, ఒక్కొక్కర్ని చొప్పున ఇటలీ, స్వీడన్‌, ఫ్రాన్స్‌ దేశాలలో ఉండే ఎన్ఆర్ఐలు దత్తత తీసుకున్నారు.

ఇప్పటికే పిల్ల‌లు ఉన్న‌వారు సైతం తమ జీవితాల్లోకి అనాథలను ఆహ్వానించడం నిజంగా గొప్ప విష‌యం. ఏడాది కాలంలో 25 మంది వ్యాపారవేత్తలు, 17 మంది గ‌వ‌ర్న‌మెంట్ ఎంప్లాయిస్, 15 మంది రైతులు, 11 మంది టీచ‌ర్స్, 10 మంది వివిధ సంస్థ‌ల‌ మేనేజర్లు, 10 మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, నలుగురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు దత్తత తీసుకున్నారు. ఇంకా వైద్యులు, రెస్టారెంట్ల యజమానుల, బ్యాంకు ఉద్యోగులు, దర్జీలు, భారీ సంఖ్య‌లో ప్రైవేటు ఉద్యోగులు సైతం పిల్ల‌ల్ని ద‌త్త‌త తీసుకున్నారు.

ప్రస్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని వివిధ‌ శిశుగృహాల్లో 0-6 ఏళ్ల వ‌య‌సున్న‌ 133 మంది చిన్నారులున్నారు. వీరిలో 72 మంది అమ్మాయిలు, 61 మంది అబ్బాయిలు. దత్తత కోసం ఏకంగా 832 అప్లికేష‌న్లు వ‌చ్చాయి… 11 మంది పిల్లలను ఇప్పటికే రిజర్వు చేశారు. కోవిడ్-19 కార‌ణంగా దత్తత ప్రక్రియకు ఏప్రిల్‌ నుంచి అడ్డంకి ఏర్పడింది. దాంతో పిల్లల ఎలా ఉన్నార‌నే విష‌యాల‌ను ఆయా దంపతులు రోజూ ఫోన్ల ద్వారా వాక‌బు చేస్తున్నారు.