Breaking News
  • గుంటూరు: మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కాలేజీలో లైంగిక వేధింపులు. ప్రొ.నాగేశ్వరరావుపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసిన విద్యార్థినులు. విచారణ చేపట్టిన ప్రిన్సిపాల్‌. రిజైన్‌ చేసి వెళ్లిపోయిన ప్రొ.నాగేశ్వరరావు.
  • వైసీపీ ఎన్నికల హామీలో వృద్ధాప్య పెన్షన్‌ రూ.3 వేలు అన్నారు. కానీ రూ.2,250 మాత్రమే ఇస్తున్నారు. ఒక్కో పింఛన్‌ దారుడు రూ.750 నష్టపోతున్నాడు. పెన్షన్‌ వయస్సు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తామన్నారు. దీనివల్ల కొత్తగా మరో రూ.10 లక్షల మందికి పెన్షన్‌ దక్కాలి. కానీ ఇప్పటివరకు కొత్త పింఛన్‌ లబ్ధిదారుకి ఒక్క రూపాయి ఇవ్వలేదు -పవన్‌ కల్యాణ్‌
  • వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో రెండు కోడెలు మృతి. అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్న భక్తులు.
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ఆర్డీవో ఆఫీసుపై ఏసీబీ దాడి. రూ.75 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్డీవో సీసీ సందీప్‌.
  • నెల్లూరు: బాలికపై అత్యాచారయత్నం కేసు. నిందితుడు అజయ్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు. పోక్సో చట్టం కింద కేసునమోదు.
  • తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ. రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శిగా బి.వెంకటేశ్వర్‌రావు. ఎంసీహెచ్‌ఆర్డీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌గా ఎ.అశోక్‌. కరీంనగర్‌ కలెక్టర్‌గా కె.శశాంక్‌. ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్‌గా సర్ఫరాజ్‌. గద్వాల జిల్లా కలెక్టర్‌గా శ్వేత మహంతికి అదనపు బాధ్యతలు.

డాలస్‌లో జగన్ రాక కోసం.. ప్రవాసుల ఎదురుచూపు

NRI Telugu organisations in US gear up to welcome AP CM Jagan, డాలస్‌లో జగన్ రాక కోసం.. ప్రవాసుల ఎదురుచూపు

ఏపీ సీఎం జగన్‌ రాక కోసం అమెరికాలోని తెలుగు వారంతా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటిస్తారు. జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు ప్రవాసాంధ్రులంతా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 17వ తేదీన డాలస్‌లోని కే బెయిలీ హాచిసన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రసాసాంధ్రులను ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు. ఈ సభను జయప్రదం చేసేందుకు ప్రవాసాంధ్రులు పార్టీలకు అతీతంగా సన్నాహాలు చేస్తున్నారు. తెలుగువారంతా ఆనాటి సభకు తరలి రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. జగన్‌ సభ సన్నాహాల కోసం ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో IANT, తానా, ఆటా, నాటా, టీపాడ్‌, నాట్స్‌, డాటా, AAPI తదితర తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.