అమెరికా వర్సిటీకి భారతీయుడి భారీ విరాళం

ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ పేరిట యూనిర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా గణిత విభాగంలో ప్రొఫెసర్‌షి్‌పను ప్రారంభించడం కోసం భారత సంతతి దంపతులు దాదాపు రూ. 7 కోట్లు విరాళంగా ఇచ్చారు. గణిత శాస్త్రానికి ఎనలేని సేవలు చేసిన భారతీయుడు శ్రీనివాస రామానుజన్‌పై గౌరవంతో తాను పనిచేస్తున్న వర్సిటీలోనే విజిటింగ్‌ ప్రొఫెసర్‍షిప్‍ను ప్రారంభించడానికి ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త వరదరాజన్‌, ఆయన భార్య వేద పూనుకున్నారని అధికారులు తెలియజేశారు. దీనికి వర్సిటీ కూడా ఆమోదం తెలిపిందన్నారు. ఈ ఏడాది […]

అమెరికా వర్సిటీకి భారతీయుడి భారీ విరాళం
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2019 | 3:30 PM

ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ పేరిట యూనిర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా గణిత విభాగంలో ప్రొఫెసర్‌షి్‌పను ప్రారంభించడం కోసం భారత సంతతి దంపతులు దాదాపు రూ. 7 కోట్లు విరాళంగా ఇచ్చారు. గణిత శాస్త్రానికి ఎనలేని సేవలు చేసిన భారతీయుడు శ్రీనివాస రామానుజన్‌పై గౌరవంతో తాను పనిచేస్తున్న వర్సిటీలోనే విజిటింగ్‌ ప్రొఫెసర్‍షిప్‍ను ప్రారంభించడానికి ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త వరదరాజన్‌, ఆయన భార్య వేద పూనుకున్నారని అధికారులు తెలియజేశారు. దీనికి వర్సిటీ కూడా ఆమోదం తెలిపిందన్నారు. ఈ ఏడాది డిసెంబరులో జరగనున్న వర్సిటీ శత వార్షికోత్సవాల్లో భాగంగా దీనిని ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.