Breaking News
  • కడప: వివేకా హత్యపై సీబీఐ విచారణ జరపాలి. బీజేపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా డిప్యూటీ సీఎం అంజద్‌ రాజీనామా చేయాలి. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడుతారు-ఆదినారాయణరెడ్డి.
  • రేపు పవన్‌ కల్యాణ్ ఢిల్లీ పర్యటన. కేంద్రీయ సైనిక్‌ బోర్డు కార్యాలయం సందర్శించనున్న పవన్‌. అమరవీరుల సంక్షేమానికి రూ.కోటి అందించనున్న పవన్‌.
  • కృష్ణాజిల్లా: చందర్లపాడు తహశీల్దార్‌ ఆఫీస్‌ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం. పక్కా ఇళ్ల స్థలాలకు తన పొలంలో మట్టి తవ్వుతున్నారని మనస్తాపం. పురుగులమందు తాగబోయిన రైతు, అడ్డుకున్న సిబ్బంది.
  • ప.గో: తాడేపల్లిగూడెం శశి ఇంజినీరింగ్‌ కాలేజ్ విద్యార్థి మృతి. బైక్‌పై నుంచి పడి మృతిచెందాడంటున్న తండ్రి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు.
  • హైదరాబాద్: మిస్టరీగా మారిన ఆయుష్‌ చాన్‌ బే మృతి, ఈనెల 16న స్నేహితుడి పుట్టిన రోజు అని వెళ్లిన ఆయుష్‌, నిన్న రక్తపు మడుగులో శవమై తేలిన ఆయుష్‌, ఆయుష్‌పై మృతిపై అనుమానాలు.
  • విజయవాడ: అక్రమ కట్టడాలపై ఏసీబీ అధికారుల దాడులు. అనధికారిక అనుమతులపై లోతైన విచారణ. అక్రమంగా నిర్మించిన భవన యజమానులపై చర్యలకు సిఫారసు.

ఎన్పీఆర్‌ అమలుకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్!

NPR In AP, ఎన్పీఆర్‌ అమలుకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్‌లో నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(‌ఎన్పీఆర్)ను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టం, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ (ఎన్ఆర్సీ)లపై తన వైఖరిని తెలియజేసిన జగన్ సర్కార్.. ప్రస్తుతం ఎన్పీఆర్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

ప్రజల్లో ఎన్పీఆర్‌పై భయాలు, అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటికి వివరణలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 124వ నెంబర్ జీఓను విడుదల చేసింది. ఇక ఈ ప్రాసెస్‌ను ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో అమలు చేయనుంది. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియను నిర్వహించినట్లు సమాచారం. అటు ఎన్పీఆర్‌ను నమోదు చేసుకునేటప్పుడు జనగణన సిబ్బంది వ్యవహరించాల్సిన తీరు, సమాచారం సేకరించాల్సిన విధానాన్ని కూడా ఉత్తర్వుల్లో వివరించింది.

ఈ ప్రక్రియకు ప్రజలు ఎలాంటి డాక్యూమెంట్స్ చూపించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపోతే ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్సీలకు  కాంగ్రెస్ పాలిట రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి విదితమే.

 

NPR In AP, ఎన్పీఆర్‌ అమలుకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్!

Related Tags