ఇంటర్నేషనల్ స్థాయికి చేరుకున్న మన “యూపీఐ”

యూపీఐ.. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్. దీని గురించి అందరికీ తెలిసిందే. అదేనండి మనం మనీ ట్రాన్సఫర్‌కి సంబంధించిన గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్స్‌ ఉపయోగిస్తుంటాం కదా.. అవన్నీ ఈ యూపీఐ ఆధారంగా పనిచేసేవే. ఇది మన దేశానికి చెందిన నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(NPCI)కు చెందినది. అయితే దీనిని ఇప్పడు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ వెల్లడించారు. ఇప్పటికే అనేక దేశాలు ఇటువంటి ఫండ్ ట్రాన్సఫర్‌ […]

ఇంటర్నేషనల్ స్థాయికి చేరుకున్న మన యూపీఐ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 18, 2019 | 3:00 PM

యూపీఐ.. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్. దీని గురించి అందరికీ తెలిసిందే. అదేనండి మనం మనీ ట్రాన్సఫర్‌కి సంబంధించిన గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్స్‌ ఉపయోగిస్తుంటాం కదా.. అవన్నీ ఈ యూపీఐ ఆధారంగా పనిచేసేవే. ఇది మన దేశానికి చెందిన నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(NPCI)కు చెందినది. అయితే దీనిని ఇప్పడు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ వెల్లడించారు. ఇప్పటికే అనేక దేశాలు ఇటువంటి ఫండ్ ట్రాన్సఫర్‌ నెటవర్క్‌పై ఆసక్తి కనబర్చాయని.. ఈ క్రమంలో ఈ యూపీఐని.. ఇంటర్నేషనల్ మార్కెట్‌కు తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీని కోసం.. ఓ అనుబంధ సంస్థను కూడా ఏర్పాటు చేశామని.. అది ఈ యూపీఐని అంతర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు పనిచేస్తుందన్నారు.

ఈ సందర్భంగా.. యూపీఐ పనితీరును ఇటీవల బ్యాంక్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్మెంట్స్‌ ప్రశంసించిన తీరును గుర్తు చేశారు. యూపీఐ ఇంటర్నేషనల్ మార్కెట్ దృష్టిని ఆకర్షించిందన్నారు. అమెరికాలోని కేంద్ర బ్యాంక్‌ ఫెడ్‌ కూడా.. ఈ యూపీఐ విధానాన్ని ఫాలో అవ్వాలని ప్రముఖ సెర్చింజన్‌ గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అక్కడ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. కాగా, భారత్‌లో “గూగుల్‌కు పే” యాప్‌‌కు 35శాతం మార్కెట్‌ వాటాను దక్కించుకోగా.. ప్రస్తుతం భారత్‌కు చెందిన 140 బ్యాంకులకు యూపీఐలో సభ్యత్వం ఉంది.