అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల నోటిఫికేష‌న్ విడుద‌ల‌

రాష్ర్ట అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల నోటిఫికేష‌న్ శుక్ర‌వారం విడుద‌ల‌య్యింది. వ‌చ్చే నెల 7 నుంచి స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబ‌ర్ 7వ తేదీ ఉద‌యం 11 గంట‌ల‌కు శాస‌నస‌భ‌, శాస‌నమండ‌లి స‌మావేశాలు ప్రారంభ‌మవుతాయి.

అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల నోటిఫికేష‌న్ విడుద‌ల‌
Follow us

|

Updated on: Aug 21, 2020 | 8:50 PM

రాష్ర్ట అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల నోటిఫికేష‌న్ శుక్ర‌వారం విడుద‌ల‌య్యింది. వ‌చ్చే నెల 7 నుంచి స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబ‌ర్ 7వ తేదీ ఉద‌యం 11 గంట‌ల‌కు శాస‌నస‌భ‌, శాస‌నమండ‌లి స‌మావేశాలు ప్రారంభ‌మవుతాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కోవిడ్‌-19 మార్గదర్శకాలకు అనుగుణంగా తాజా సెషన్‌ను నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల నిర్ణయం తీసుకుంది. శాస‌న‌స‌భ‌ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన వ్యవహారాలశాఖ‌ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఇతర అధికారులు అసెంబ్లీ సమావేశ మందిరం ఏర్పాట్లను పరిశీలించారు. ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపులపై ఓ నిర్ణయానికి వచ్చారు. ప్రతఒక్కరు భౌతిక‌దూరం పాటించ‌డం, మాస్కులు ధ‌రించ‌డం, శానిటైజేషన్, ఇతర ముందు జాగ్రత్త చర్యలను నిర్ధారించడానికి ఇప్ప‌టికే చ‌ర్య‌ల‌ను చేప‌ట్టారు. అసెంబ్లీ ప్రాంగణంలో సందర్శకుల ప్రవేశాన్ని పరిమితం చేయడాన్ని కూడా వారు పరిశీలిస్తున్నారు. ఈ విష‌యాన్ని సీఎం కేసీఆర్‌కు త్వ‌ర‌లోనే నివేదిక‌ను స‌మ‌ర్పించ‌నున్నారు.

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్