నోట్ బుక్స్ పై కేసీఆర్ ఫోటోలు.. పిల్లలకు పాలిటిక్స్ అవసరమా ?

అభంశుభం తెలియని పిల్లలకు రాజకీయాలు అవసరమా ? వారి మనస్సుల్లోనూ పాలిటిక్స్ తాలూకు ‘ క్రీనీడలు ‘ జొప్పించడం సమర్థనీయమా ? ఇదేదో అల్లాటప్పా ప్రశ్న కాదు. హైదరాబాద్ సిటీలో అధికార టీఆర్ఎస్ నేత ఒకరి ‘ వినూత్న ఐడియా ‘ ఇది.. స్థానిక రహమత్ నగర్ లో షఫి అనే ఈ నేతకు తట్టిన ఆలోచన.. స్కూలు పిల్లల కోసమని ఈయన నోట్ పుస్తకాలపై సీఎం కేసీఆర్, మరో ఇద్దరు టీఆర్ఎస్ నాయకుల ఫోటోలను ముద్రించి […]

నోట్ బుక్స్ పై కేసీఆర్ ఫోటోలు.. పిల్లలకు పాలిటిక్స్ అవసరమా ?
Follow us

|

Updated on: Aug 29, 2019 | 12:26 PM

అభంశుభం తెలియని పిల్లలకు రాజకీయాలు అవసరమా ? వారి మనస్సుల్లోనూ పాలిటిక్స్ తాలూకు ‘ క్రీనీడలు ‘ జొప్పించడం సమర్థనీయమా ? ఇదేదో అల్లాటప్పా ప్రశ్న కాదు. హైదరాబాద్ సిటీలో అధికార టీఆర్ఎస్ నేత ఒకరి ‘ వినూత్న ఐడియా ‘ ఇది.. స్థానిక రహమత్ నగర్ లో షఫి అనే ఈ నేతకు తట్టిన ఆలోచన.. స్కూలు పిల్లల కోసమని ఈయన నోట్ పుస్తకాలపై సీఎం కేసీఆర్, మరో ఇద్దరు టీఆర్ఎస్ నాయకుల ఫోటోలను ముద్రించి వాటిని విద్యార్థులకు పంచి పెట్టాడు. అయితే ప్రభుత్వానికి, దీనికి సంబంధం లేదని ఆయన చెబుతున్నాడు. వీటిని తన పర్సనల్ కెపాసిటీలో పంచానని అంటున్నాడు. కానీ… విద్యాశాఖ అధికారులు, మేధావులు మాత్రం ఈయన చర్యను తప్పు పడుతున్నారు. విద్యాసంస్థల్లో రాజకీయ పార్టీలను ప్రమోట్ చేయడం తగదంటున్నారు.

వీటిలో రాజకీయపార్టీలను ప్రమోట్ చేయడాన్ని మానుకోవాలని సూచిస్తున్నారు. నేతల ముఖచిత్రాలతో పుస్తకాలు పంపిణీ చేయాలన్న రూల్ ఏదీ లేదని, కానీ పార్టీలు ఈ విధమైన చర్యలకు పూనుకోరాదని వారు అంటున్నారు. చదువులపైనే దృష్టి పెట్టే విద్యార్థులను ఓటు బ్యాంకులుగా పరిగణిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ ఇలాంటి పధ్దతిని పాటించడం ప్రారంభిస్తే ఇతర పార్టీలు కూడా ఇదే ధోరణిని అనుసరిస్తాయన్నది వీరి వాదన. పిల్లల మనసులపై రాజకీయాల ప్రభావం పడడం మంచిది కాదు..వారి భవితవ్యంపై ఇది తీవ్ర ప్రభావం చూపవచ్చునన్నది నిపుణుల వాదన.

ఆ మధ్య మహారాష్ట్రలో అక్కడి ప్రభుత్వం ‘ చాచా చౌదరి అండ్ మోదీ ‘ పేరిట ముఖ్యంగా మోదీ ఫొటోతో పిల్లల పుస్తకాలను ముద్రించింది. సర్వ శిక్షా అభియాన్ కింద ప్రభుత్వం ఈ ‘ పని ‘ చేపట్టింది. దీంతో బీజేపీపై ఎన్సీపీ వంటి పార్టీలు దుమ్మెత్తిపోశాయి. విద్యా వ్యవస్థలో పీఎం మోదీని ‘ మార్కెటింగ్ ‘ చేస్తున్నారని, ఇది ఒక పార్టీకి ప్రయోజనం కలిగిస్తుందేమో కానీ విద్యార్థుల మనసులు కలుషితం కావడానికే ఇలాంటి చర్యలు దోహదపడతాయని ఈ పార్టీలు పేర్కొన్నాయి.( చాచా చౌదరి అన్నది ఓ కామిక్ క్యారక్టర్). విద్య అన్నది సీరియస్ టాపిక్. ప్రతిపక్షాలతో సహా అన్ని పార్టీలూ మన విద్యా వ్యవస్థకు సంబంధించి సరైన, సముచితమైన నిర్ణయాలు తీసుకోవాలని, రాజకీయ ప్రయోజనాల కోసం ‘ చిల్లర ‘ ఆలోచనలు చేయరాదని ఈ పార్టీలు సూచించాయి. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఒక దశలో పిల్లల పుస్తకాలపై సినీ తారల ముఖచిత్రాలను ముద్రించారు. అయితే దీనిపై పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ముద్రణా సంస్థలు ఈ ‘ నిర్వాకానికి ‘ స్వస్తి చెప్పాయి.